BigTV English
Advertisement

i in iPhone: ఐఫోన్ వాడుతున్నారు సరే.. iPhoneలో iకి అర్థం తెలుసా మరి?

i in iPhone: ఐఫోన్ వాడుతున్నారు సరే.. iPhoneలో iకి అర్థం తెలుసా మరి?

i in iPhone: ప్రముక దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాపిల్ కంపెనీ నుంచి మార్కెట్లోకి
ఏ ప్రొడక్ట్ వచ్చినా డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదు. అలాగే ఐఫోన్ చేతిలో ఉన్నవారి రేంజే సెపరేటు అన్నట్టుగా చూస్తుంటారు జనాలు కూడా. ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనేది చాలామందికి కోరికగానూ ఉంటుంది. ఇక యాపిల్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయంటే.. హాట్ కేకుల్లా అమ్ముడుపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.


ప్రొడక్ట్ ఏదైనా ‘i’ ఉండాల్సిందే..

జనాల్లో ఒక్క iPhoneకి మాత్రమే కాదు.. యాపిల్‌కు సంబంధించిన iPad, iMac, iTunes.. ఇలా ప్రతి ప్రొడక్ట్స్ పట్ల విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఐఫోన్, ఐపాడ్, ఐమాక్ వంటి యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటికీ ముందుగా i అని ఎందుకు ఉంటుంది? అసలు iకి అర్థమేంటని అందరికీ సందేహం వచ్చే ఉంటుంది. అయితే, i అంటే ఇంటెలిజెన్స్ అని కొందరు ఇంటర్నెట్ అని ఇంకొందరు ఇన్నోవేషన్ అని మరికొందరు అనుకుంటుంటారు. ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెబుతుంటారు. మరికొందరైతే..  iPhone అంటే నా ఫోన్ అని అర్థం కావచ్చని కూడా అనుకుంటుంటారు.

స్టీవ్ జాబ్స్ ఏమన్నారంటే?

iPhone ముందు i ఎందుకు అనే సందేహం ఇప్పుడు వచ్చింది కాదు.. 25 ఏళ్ల కిందటే చాలామందికి ఈ డౌట్ వచ్చిందట. దీనికి యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1998లో మొదటగా iMac కంప్యూటర్‌ను ఆవిష్కరించినప్పుడు i అక్షరానికి అర్థం ఏంటో తెలిపారు. ఆయన ఏమన్నారంటే.. i అంటే కేవటం Internet మాత్రమే కాదు.. దానికి ఐదు ప్రత్యేక అర్థాలున్నాయని తెలిపారు. అవేంటంటే..
1. Internet – ప్రపంచాన్ని కనెక్ట్ చేసే శక్తి
2. Individual – వ్యక్తిగత అనుభవాన్ని ప్రతిబించించే గుర్తు
3. Instruct – నేర్పించాలనే ఉద్దేశం
4. Inform – సమాచారం అందించే సాంకేతికత
5. Inspire – ప్రేరణనిచ్చే ఆవిష్కరణ


iPhone పేరు వెనకున్న సీక్రెట్..

మరో సందర్భంగా స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ.. iకి టెక్నికల్‌గా ఎలాంటి అధికారిక అర్థం లేదని, i అనేది కేవలం ఉద్యోగులు, వినియోగదారులకు సంస్థ విలువలను తెలియజేయడానికి పర్సనల్ Pronoun, Instruction మాత్రమేనని యాపిల్ వ్యవస్థాపకుడు జాబ్స్ తెలిపారు. ఇంకో అర్థంగా i అంటే బోధించడం, తెలియజేయడం, ప్రేరేపించడం అని కూడా తెలిపారు. అయితే, యాపిల్ తన మొదటి iPhoneను 2007లో విడుదల చేసింది. ఈ ప్రారంభంతో కంపెనీ సాకేంతికత ప్రపంచంలో ఒక కొత్త విప్లవాన్ని ప్రారంభించింది.

Read More: నెలసరి నొప్పితో పోరాటం ఉండదిక.. ఉపశమనాన్నిచ్చే డివైజ్ ఇదే!

బలమైన పునాదులు..

కొత్త ప్రొడక్ట్స్ ఏది తీసుకురావాలన్నా.. యాపిల్ విజన్‌లో 5 ‘ఐ’లు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా.. ప్రపంచం మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, సంస్థ పునాదులను విస్మరించకుండా.. ఈ ‘ఐ’కి అర్థాన్ని విస్తరిస్తూ వస్తోంది యాపిల్. పునాది బలంగా ఉంటేనే ఏ వ్యాపారమైన రాణించగలుగుతుంది. కాగా యాపిల్ మొదటగా iMac, తర్వాత iPod, iTunes, iPad, చివరగా iPhone వంటి పరికరాల్లో i అక్షరాన్ని ఉపయోగించింది. ప్రతి ఉత్పత్తిలో కూడా వినియోగదారుడికి సులభతరం, వ్యక్తిగతం, స్మార్ట్ అనుభవం ఇవ్వడమే ఈ సంస్థ లక్ష్యం. 2007లో మొదట iPhone విడుదలయినప్పటి నుంచి ప్రపంచ మొబైల్ టెక్నాలజీని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతానికి యాపిల్‌కు ప్రపంచంలో 1.5 బిలియన్‌కు పైగా యాక్టివ్ iPhone వినియోగదారులున్నారని అంచనా. భారత మార్కెట్లో Apple ఇటీవల తమ ఉత్పత్తులను Make in India కింద తయారు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Read More: షాకింగ్.. సూసైడ్ ఆలోచనలో 12లక్షల మంది ChatGPT యూజర్స్!

 

 

 

 

Related News

Samsung Browser: సామ్ సంగ్ నుంచి నయా బ్రౌజర్.. సేఫ్టీకి ఇక తిరుగుండదు!

Android – iPhone: ఆపిల్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు బెస్టా? అసలు విషయం చెప్పిన గూగుల్!

iPhone Scams: ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే ఐఫోన్లలో మోసాలు ఎక్కువ.. యాపిల్‌పై ఎటాక్ చేసిన గూగుల్

Whatsapp Passkey : వాట్సాప్‌లో పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోనసరం లేదు.. కొత్త ఫీచర్‌ని ఇలా యాక్టివేట్ చేయండి

Asus ROG Phone 9 FE 5G: అసూస్ రోగ్ ఫోన్ 9 ఫి 5జి.. గేమింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మాన్‌స్టర్ ఫోన్

USSD fraud: సైబర్ మోసగాళ్ల కొత్త మోసం.. మీ కాల్స్, ఓటీపీలు నేరుగా వారికే.. జాగ్రత్త!

SmartPhone Comparison: మోటో X70 ఎయిర్ vs వివో V60e vs వన్‌ప్లస్ నార్డ్ 5.. మిడ్ రేంజ్‌లో ఏది బెస్ట్?

Big Stories

×