Namrata Shirodkar: ఘట్టమనేని కోడలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
1993 లో ఈమె మిస్ ఇండియాగా గెలిచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక వంశీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
వంశీ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదేమో కానీ.. మహేష్ కు మాత్రం నమ్రత నచ్చేసింది. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఇరు కుటుంబాలను ఒప్పించి 2005 లో మహేష్- నమ్రత ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు గౌతమ్.. కూతురు సితార.
ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నమ్రత.. ఇప్పటివరకు మళ్లీ రీఎంట్రీ ఇవ్వలేదు. తానెప్పుడూ సినిమాల్లోకి తిరిగి మళ్లీ రావాలని అనుకోనని నమ్రత చెప్పుకొస్తూ ఉంటుంది.
ఘట్టమనేని కోడలిగా.. మహేష్ కు వైఫ్ గా.. పిల్లలకు తల్లిగా.. బిజినెస్ విమెన్ గా ఆమె ఎన్నో బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తుంది.
ఇక ఒకప్పుడు నమ్రత అంత స్టైలిష్ గా కనిపించేది కాదు.. సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను ఎక్కువ షేర్ చేసేది కాదు.
కానీ, ఈ మధ్యకాలంలో నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
తాజాగా నమ్రత తన సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అల్ట్రా స్టైలిష్ లుక్ లో నమ్రత కనిపించింది. బ్లాక్ టాప్.. గ్రే హెయిర్.. డిజైనర్ గాగుల్స్ పెట్టుకొని చాలా కూల్ గా కనిపించింది. ఇప్పటివరకు మహేష్ కే వయస్సు వెనక్కి వెళ్తుంది అనుకునేవారు. కానీ, ఇప్పుడు నమ్రతకు కూడా వయస్సు వెనక్కి వెళ్తున్నట్లు ఉంది. అసలు ఇలాంటి లుక్ లో ఆమెను ఫ్యాన్స్ ఊహించలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.