BigTV English

Kulaganana: కుల‌గ‌ణ‌న‌పై సీఎం స‌మీక్ష‌..పేప‌ర్లు ప‌డేసి ఉండ‌టంపై సీరియస్.. అధికారుల‌కు వార్నింగ్!

Kulaganana: కుల‌గ‌ణ‌న‌పై సీఎం స‌మీక్ష‌..పేప‌ర్లు ప‌డేసి ఉండ‌టంపై సీరియస్.. అధికారుల‌కు వార్నింగ్!

Kulaganana: కుల‌గ‌ణ‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వే పేప‌ర్లు రోడ్ల‌పై క‌నిపించ‌డంపై సీఎం ఆరా తీశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 44.1 శాతం స‌ర్వే పూర్తి అయింద‌ని సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. 51.24 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల స‌ర్వే పూర్తి చేశామ‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. స‌ర్వేలో 87వేల 807 మంది సిబ్బంది పాల్గొన్నార‌ని అధికారులు సీఎంకు తెలిపారు. వీరితో పాటూ 8,788 మంది సూప‌ర్ వైజ‌ర్లు స‌ర్వేలో పాల్గొన్నార‌ని చెప్పారు.


Also read: తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ గా గద్దర్ కూతురు వెన్నెల

ఇదిలా ఉండ‌గా కుల‌గ‌ణ‌ను ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మంగా తీసుకున్న సంగ‌తి తెల‌సిందే. దేశానికే తెలంగాణ కుల‌గ‌ణ‌న మోడ‌ల్ గా ఉండాల‌ని ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ కుల‌గ‌ణ‌ను దేశానికే మోడ‌ల్ గా తీసుకోవాల‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్ర‌క‌టించారు. మ‌రోవైపు రాష్ట్రంలో బీసీ జ‌నాభా ఇత‌ర అంశాల కోసం స‌ర్వేను ప‌గ‌డ్బందీగా చేప‌డుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నిక‌ల్లో కుల‌గ‌ణ‌న ఆధారంగానే రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా సీట్లు కేటాయించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది.


అంతే కాకుండా మ‌రోసారి రోడ్ల‌పై కుల‌గ‌ణ‌న పేప‌ర్లు క‌నిపించాయ‌ని, కుల‌గ‌ణ‌నపై ఇత‌ర నెగిటివ్ వార్త‌లు క‌నిపించ‌వ‌ద్ద‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు బీసీ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు కుల‌గ‌ణ‌న‌పై రివ్యూ స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న ఏ విధంగా జ‌రుగుతుంది? ఏ ప్రాంతాల్లో నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని ఇత‌ర అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×