Prashanth Neel and NTR Movie: జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘ఎన్టీఆర్-నీల్'(NTR-Neel Movie) ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల వార్ 2 విడుదలతో తారక్ ఫ్రీ అయ్యాడు. దీంతో ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. కొల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో డార్క్ థీమ్‌లో రూపొందుతుంది. ఈ సినిమా కోసం తారక్ చాలా శ్రమిస్తున్నాడు. దీనికి నిదర్శనం అతడి మేకోవరే. ఈ చిత్రం కోసం కసరత్తు చేసి బక్కచిక్కాడు. ప్రకటనతోనే ఈ మూవీపై బజ్ నెలకొంది. ఇక గతేడాది తారక్ పుట్టిన రోజు సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ విపరీతమైన బజ్ పెంచాయి. దీంతో ఈ చిత్రం నుంచి వచ్చి అప్‌డేట్స్ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా NTR-Neel కి సంబంధించిన అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్, టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో కేజీయఫ్, సలార్ చిత్రాల్లో చూశాం. ఆయన దర్శకుడితా పరిచయం అవుతూ తెరకెక్కిన మొదటి మూవీ కేజీయఫ్, కేజీయఫ్ 2లు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టాయి. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేశాయి. కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలోనే ఈ స్థాయిలో విజయం సాధించి.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిన చిత్రంగా కేజీయఫ్ నిలించింది. ఇందులో నటించిన యష్‌కి కన్నడ పరిశ్రమకు తప్పితే.. ఇతర భాషల్లో పెద్దగా గుర్తింపు లేదు. కానీ, ఈ చిత్రంలో ఆయన పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కేజీయఫ్ తర్వాత ప్రభాస్‌తో సలార్ తెరెక్కించాడు.
కేజీయఫ్, సలార్ కంటే ఎక్కువ రేట్లు
కోల్ మైన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో డార్క్ థీమ్ మూవీ చేయబోతున్నాడు. ఇది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కతోఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నీల్ మామ భారీగా ప్లాన్ చేస్తున్నాడట. కేజీయఫ్, సలార్‌లను మించి ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రానికి బడ్జెట్ పరిమితులే లేవట. అంటే అర్థం చేసుకోండి.. ఈ మూవీని నీల్ మావ ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో. NTR-Neel మూవీ కేజీయఫ్, సలార్ కంటే ఎన్నో రేట్లు మెరుగ్గా ఉంటుందని స్వయంగా ప్రశాంత్ నీల్ అన్నారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ మూవీ విశేషాలను పంచుకున్నారు. ఇది తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఇది కేజీయఫ్, సలార్ కంటే ఎన్నో రేట్లు ఎక్కువగ ఉంటుంది. ఈ సినిమాకు ఇంతే బడ్జెట్ అన్న పరిమితులు లేవు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ మూవీపై మరింత బజ్ పెంచాయి. అలాగే మూవీ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి.
నీల్ కేరీర్ అతిపెద్ద ప్రాజెక్ట్ గా
మూవీ షూటింగ్ చకచక జరుగుతోంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్‌లో నటించడానికి ఒప్పుకున్నారంటేనే ఈ చిత్రం ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోండి. ఈ సినమాకు ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు మూవీ అవుట్‌పుట్ చూసుకుంటూ ప్రశాంత్ సంతోషంగా ఉన్నారు. ఆయన ఊహించుకున్న దానికంటే కూడా చాలా బాగా వస్తుందని చెప్పారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో చైనా ప్రస్థావన ఉండటంతో డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ 25, 2026లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని ఇటీవల మూవీ టీం ప్రకటించింది. కాగా ఇందులో సప్త సాగరాలు మూవీ ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు టోవినో థామస్, కమెడియన్ ప్రియదర్శి, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Jalsa Re Release: అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి.. పవన్ జల్సా రీ రిలీజ్ వాయిదా!