Tvk Party – Pawan Kalyan: సినిమాలకి రాజకీయాలకి మంచి అవినాభా సంబంధం ఉంది. ముఖ్యంగా తెలుగు రాజకీయాల కంటే తమిళ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో సినీనటుల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తమిళ రాజకీయాల్లో విజయం సాధించిన చాలామంది ప్రముఖులు సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే.
ఒక సందర్భంలో రజనీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఒక వారం రోజులు పాటు ఆయన హాస్పిటల్లో ఉండటం వలన. ఈ ఏజ్ లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒత్తిడి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తన డెసిషన్ మార్చుకున్నారు. కమల్ హాసన్ యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు. ఇక రీసెంట్ గా దళపతి విజయ్ తమిళ వెట్రి కలగం అనే పేరుతో పార్టీని స్థాపించారు.
పవన్ చేతిలో విజయ్ పార్టీ జెండా?
తెలుగు రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తనదైన ముద్రను వేశారు. 2014లో పార్టీని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత 2024లో డిప్యూటీ సీఎం గా పదవిని చేపట్టారు. ఈ పదేళ్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు వెనకడుగు వేయలేదు. అలానే పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులను ఇంకా విమర్శిస్తుంటారు కొంతమంది. అయితే ఈరోజు జరిగిన “సేనతో సేనాని” అనే సభలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.
పవన్ కళ్యాణ్ కి కొంత మంది ఒక కండువాను అందించారు. అలానే ఒక జెండాను కూడా అందించారు. పవన్ కళ్యాణ్ కండువను వేసుకొని తన జనసేన జెండాతో పాటు మరొక జెండాని కూడా ఊపారు. అయితే ఇది ఇళయ దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ జెండా అని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. దీనిపై కొంతమంది ఆత్రుతగా కామెంట్స్ చేస్తుంటే, ఇంకొంతమంది ఆలోచనతో క్లారిటీ ఇస్తున్నారు.
ఇంతకు ఆ జెండా ఏంటి?
వాస్తవానికి ఆ జెండా టీవీకే పార్టీ విజయ్ ది కాదు. ఆది కర్ణాటక రాష్ట్రీయ జెండా. దానిని పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ జెండాతో పాటు సభలో ఊపారు. ఇది జరిగిన వాస్తవం. ఇది తెలియకుండా కొంతమంది అత్యుత్సాహంతో అది విజయ్ జెండా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై జనసేన పార్టీ ప్రత్యేకంగా మరో క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాల్సిన పరిస్థితి.
Also Read: Rajinikanth: రజినీకాంత్ నోట బాలకృష్ణ డైలాగులు, సూపర్ స్టార్ ఆసక్తికర వీడియో