Nani : చాలామందికి సినిమా అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలు సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. అప్పుడు సినిమాలను విపరీతంగా ఇష్టపడిన వాళ్లే నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులుగా, నటులుగా కొనసాగుతున్నారు అని చెప్పడంలో అసలు అతిశయోక్తి లేదు.
ఇంక నాని విషయానికి వస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేస్తే తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అయితే నాని చిన్నప్పటి రోజులు గురించి వాళ్ళ పిన్ని ఒక రియాలిటీ షోలో పంచుకున్నారు.
నాని గురించి వాళ్ళ పిన్ని మాటల్లో
అక్క పిల్లలు అంటే జనరల్ గా పిన్నిలే ఎక్కువ పెంచుతారండి నాకు తెలిసినంతవరకు. అలా చిన్నప్పటి నుంచి నాని నా సొంత కొడుకు అన్నట్టు పెంచేదాన్ని. వాడెప్పుడూ అందరిలోకి స్పెషల్ గా ఉండేవాడు. చిల్డ్రన్స్ అంతా కలిసేటప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవాడు. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, డాన్సులు వేస్తూ, నవ్విస్తూ ఉండేవాడు. నాని మల్టిపుల్ టాలెంటెడ్ అని నాకు ఎప్పుడూ అనిపించేది.
ఒకరోజు వాడు సినిమాల్లోకి వెళ్తాను డైరెక్టర్ గా అని చెప్పినప్పుడు నాకేమీ సప్రైజింగ్ గా అనిపించలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. నాకు అప్పుడే తెలుసు వాడు హీరోగాని డైరెక్టర్ గాని అవుతాడు అని. నాకు చిన్నప్పటినుంచి సర్ప్రైజింగ్ గా అనిపించేవాడు.
నాని స్పందన
పిన్ని మాటల్లో నాని గురించి వినగానే బాగా ఎమోషనల్ అయిపోయాడు. అలానే హిట్ 3 సినిమాలో వాళ్ల పిన్ని ఫోటో ఉంటుంది అని పర్టిక్యులర్ గా సీన్ గురించి కూడా చెప్పాడు నాని. మా లలిత పిన్ని ఇలాంటి సిచువేషన్ కోసం ఎదురుచూస్తుంది. నా గురించి ఎప్పుడు మాట్లాడదామని అంటూ స్పందించాడు నాని. నేను మా పిన్నిని మమ్మీ అని పిలుస్తాను. అమ్మని అమ్మ అని పిలుస్తాను. నాకు ఆమె కూడా అమ్మలానే, నాకు సెకండ్ మదర్ అని చెప్పాలి. అంటూ నాని రియాక్ట్ అయ్యాడు. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. నాని ప్రతి సందర్భంలో కూడా ఈ సినిమా గురించి ఎలివేషన్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కంటెంట్ సినిమా మీద భారీ హైయెప్పుడు కూడా క్రియేట్ చేసింది.
Also Read:Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం