Kamareddy: గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గత రెండు, మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి జిల్లాలు విలవిలలాడుతున్నాయి. కుండపోత వర్షాలకు ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి అయితే వరద నీరు భారీ వచ్చి చేరడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కొన్ని గ్రామాలు వరద నీటిలో మునిగాయి. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతులకు, ఇళ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం ఆదుకుంటానని ఇప్పటికే భరోసా కల్పించింది.
ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్..
అయితే.. కామారెడ్డి జిల్లాలో భారీ వరదలపై స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలకు ఓదార్చింది.. పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ప్రళయం విపత్కర పరిస్థితులు వచ్చినపుడు ప్రభుత్వం కానీ.. ప్రజా ప్రతినిధులు కానీ.. ఏమీ చేయలేరని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలు ఓవర్ కాన్పిడెన్స్ వల్ల వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. వరద తక్కువగా ఉన్నపుడు బయటికి వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ప్రజా తప్పిదం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. ఎంక్రోచ్ మెంట్ లు కూడా కారణమని చెప్పారు. సోషల్ మీడియాలో అధికారులు, ఎమ్మెల్యే కనపడటం లేదని ఇష్టమొచ్చిన పోస్ట్ లు పెడుతున్నారు.. ఓటు వేసినందుకు ముడ్డి కడగాలి అంటే కుదరదని అన్నారు. వరదల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను.. కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కామారెడ్డి లో మూడు గంటల్లో కుండ పోత వర్షం కురిసిందని.. జల విలయం సంభవించిందని అన్నారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టు ప్రక్కల చెరువులు అలుగు పారాయని.. కట్టలు తెగిపోయాయని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లాలో ఊహించని నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే తెలిపారు.
ALSO READ: September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్
వర్షాల్లో అధికారులంతా ఫీల్డ్ లో ఉండి కష్టపడి పనిచేశారు. అధికార యంత్రాంగం పనిచేయలేదు అనటం సరైంది కాదు. కొంత మంది సోషల్ వీడియో లో ఘోరమైన పోస్ట్ లు పెడుతున్నారు. ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాలి.. తప్ప ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టడం సరికాదు. వరదల్లో నేను ఎం పనిచేశానో బాధితులకు తెలుసు’ అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా