Allu Kanakaratnamma : అల్లు అరవింద్ అమ్మ , స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి భార్య అల్లు కనక రత్నమ్మ నేడు తెల్లవారుజామున కాలం చేసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. మెగా ఫ్యామిలీ హుటాహుటిన అల్లు ఫ్యామిలీ ఇంటికి తరలి వెళ్లారు. అంత్యక్రియలు జరిగినంత వరకు కూడా అక్కడే ఉన్నారు.
అయితే అవయవ దానం గురించి చాలామంది ప్రముఖులు ఎప్పటి పడితే అప్పుడు ఒక అవగాహన కల్పించడానికి వీడియోలు చేస్తూనే ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అవయవదానం చేస్తారు. ఒకరు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అవయవాలు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అని తెలుసుకొని, వాటిని దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేడు మరణించిన అల్లు కనక రత్నమ్మ అదే పనిని చేశారు.
కళ్ళను దానం చేసిన కనకరత్నమ్మ
అల్లు కనక రత్నమ్మ కళ్ళను దానం చేసినట్లు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఒక మీటింగ్ లో చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “ఈరోజు ఉదయం 2:30 మూడు గంటల ప్రాంతంలో మా అత్తగారు ఇంకా లేరు అని వార్త వినిన తర్వాత, అరవింద్ గారు బెంగళూరులో ఉండడం వలన నేనే ముందుగా వెళ్లి వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. ఆ సమయంలో నాకు ఆర్గాన్ డొనేషన్ గురించి గుర్తుకు వచ్చింది. ఆ మిడ్ నైట్ సమయంలో బ్లడ్ బ్యాంకు కు ఫోన్ చేసి స్వామి నాయుడు ని నిద్రలేపి, హాస్పిటల్లో ఎవరైనా టెక్నీషియన్స్ ఉన్నారా? కనకరత్నమ్మ గారి కళ్ళు డొనేషన్ కి నేను మిగతావన్నీ ప్రిపేర్ చేస్తాను అంటూ మాట్లాడాను.
అల్లు అరవింద్ రియాక్షన్
ఇలా ఆవిడ కళ్ళను దానం చేద్దాం అని అనుకున్న తర్వాత నేను అరవింద్ గారికి ఫోన్ చేశాను. అరవింద్ ఇలా చేద్దామని అనుకుంటున్నాను. నేను అత్తమ్మ గారు మా మా అమ్మగారికి మధ్య ఒకసారి ఈ సంభాషణ నడిచింది. ఈ సంభాషణ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. బాబు కాలి బూడిద అయిపోయేదానికి ఉంచుకొని ఏం చేస్తాం సరే బాబు అలాగే నీ ఇష్టం అని చెప్పారు. ఎటువంటి పేపర్ మీద ఆవిడ సంతకాలు చేయలేదు గాని ఆవిడ చెప్పిన మాట నాకు గుర్తుంది. నేను అరవింద్ కి ఈ మాట చెప్పగానే సరే గో హెడ్ అంటూ చెప్పారు అంటూ చిరంజీవి స్వయంగా తెలిపారు. మొత్తానికి చిరంజీవికి ఒక మాటతో చెప్పిన ఆ చెప్పిన మాటను నిలబెట్టుకుంది.
Also Read: Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి