S.S.Thaman: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్న తమన్ (Thaman)ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు రాజా సాబ్, అఖండ 2 వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తమన్ బాలకృష్ణ (Balakrishna) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్(World Book Of Records) సొంతం చేసుకున్న నేపథ్యంలో నేడు ఈయనకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే తమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
బాలయ్యను చూస్తే మాటలు రావు..
ఈ కార్యక్రమంలో భాగంగా తమన్ వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తనకు బాలయ్య గారిని చూస్తే మాటలు రావు…ఏదైనా తీసుకొని కొట్టాలనిపిస్తుంది అంటూ ఈయన మాట్లాడారు. మ్యూజికల్ గా నా చేతులలో ఏదో మొలుస్తాయి.. తన చేతిలో అప్పుడు రెండు కత్తులు లేదా రెండు కర్రలు కానీ, మా వాళ్ళందరూ నన్ను ఒకటే అడుగుతుంటారు. అసలేంటండి మీరు బాలయ్య గారిని చూస్తే అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు. నాకు కూడా ఆ విషయం అర్థం కాదు ఓసారి నా డీఎన్ఏ లో నా బ్లడ్ లో ఏముందో డాక్టర్ తో చెక్ చేయించుకోవాలి అంటూ ఈయన సరదాగా మాట్లాడారు.
ఆఖండ2 సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది..
బాలకృష్ణ గారి సినిమాలకు పనిచేసే సమయంలో చాలా ప్యూరిటీ ఉంటుందని, తనకు తెలియకుండానే తనలో ఏదో తెలియని ఎనర్జీ ఉంటుందని తెలిపారు.ఈరోజు బాలయ్య బాబు బుక్ రికార్డు చూస్తున్నారు కానీ, రేపు రాబోతున్నా మా అఖండ సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు చూస్తారు అంటూ సినిమాపై హైప్ పెంచారు. చాలామంది నన్ను చూస్తేనే బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అని మాట్లాడుతుంటారు. ఇలాంటి క్రెడిట్ రావడానికి బాలయ్య గారే కారణమని అందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా తమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
50 సంవత్సరాల సినీ ప్రస్థానం..
ఇక బాలకృష్ణ 50 సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ చేయడంతో ఈయనకు యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు కావటం విశేషం. ఈ క్రమంలోనే ఆయనను నేడు ఎంతో ఘనంగా సత్కరించారు. ఇక బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అఖండ 2 (Akhanda 2)సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి సెప్టెంబర్ 25వ తేదీ ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.
Also Read: Janhvi kapoor : ముగ్గురు పిల్లలు కావాలని ముచ్చట పడుతున్న ముద్దుగుమ్మ… అదే కారణమా?