OTT Movies: ఎప్పుడూ రొటీన్‌గా హాలీవుడ్, కొరియా, స్పానిష్ వెబ్ సీరిస్‌లే ఎందుకు చూడటం. అప్పుడప్పుడు.. తైవాన్ సీరిస్‌లు కూడా చూడండి. కొత్తగా ఉంటాయి. ఈ మధ్య ఓటీటీలో విడుదలైన ఈ ‘ఐస్‌లాండర్స్’ (Islanders 2025)సీరిస్ తప్పకుండా మీకు నచ్చేస్తుంది. ‘ఐలాండ్స్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సీరిస్‌ను తెరకెక్చించారు. ఈ కథ తైపీ నగరంలో జరుగుతుంది. ఈ కథ విజయవంతమైన వ్యాపారవేత్త జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ తరహాలో ఈ స్టోరీ.. నాలుగు దశాబ్దాల్లో అతడి జీవితంలో ఉన్న వ్యక్తుల గురించి ఇందులో చూపిస్తారు. ముఖ్యంగా అతడి భార్య, స్నేహితురాలు.. ఇలా మరికొందరితో అతడి ఉన్న అనుబంధాలు, ప్రేమ, రిలేషన్‌షిప్స్‌ను కథను ముందుకు తీసుకెళ్తుంది.
ఇదీ కథ:
లీ జియాన్-హాంగ్ (క్రిస్టోఫర్ లీ మింగ్-షున్) అనే విజయవంతమైన వ్యాపారవేత్త తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ.. ముగ్గురు మహిళలతో సంబంధం పెట్టుకుంటాడు. అతడి భార్య లిలియన్ లిన్ (రిమా జైడాన్) కుటుంబ వ్యహారాల్లో బాధ్యతగా ఉంటుంది. అతడి విజయాల్లో భాగంగా ఉంటుంది. ఆమె అంటే లీ జియాన్ కుటుంబికులకు, ఉద్యోగులకు ఎంతో గౌరవం. మరోవైపు లీ జియాన్.. మరో యువతితో సంబంధం పెట్టుకుంటాడు. ఇది చాలా సీక్రెట్ రిలేషన్‌షిప్. ఆమెతోపాటు అతడికి మరో యంగ్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమే హాంగ్ లిఫాంగ్ (ఇనా త్సాయ్). 50 ఏళ్ల లీజియన్‌కు 20 ఏళ్ల హాంగ్ చాలా సహకరిస్తుంది. వీళ్లతోపాటు లీ జియాన్-హాంగ్‌కు నమ్మకమైన అసిస్టెంట్ చెన్ హాన్-రాంగ్ (వు కాంగ్-రెన్) ఉంటాడు. అతడు లిజియాన్‌కు చెందిన తని వ్యాపార, వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేస్తాడు. లీ జియాన్ రహస్యాలన్నీ అతడికి తెలుసు. కానీ ఎవరికీ చెప్పడు. అయితే, లీజియాన్ జీవితంలోని ఈ ముగ్గురు మహిళలు వేర్వేరు వయస్సులు, నేపథ్యాలు, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ల ముగ్గురితో లీజియాన్ పండుగ చేసుకుంటుంటాడు.
ఒక వైరల్ వీడియోతో.. అంతా తలకిందులు
ఒక రాత్రి డిన్నర్ సమయంలో జరిగే తీవ్రమైన వాదనను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడతారు. అది వైరల్ కావడంతో.. లీ జియన్ జీవితంలోని ఆ ముగ్గురు మహిళల వివరాలు బహిర్గతం అవుతాయి. దీంతో ప్రజల్లో అతడికి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇమేజ్ మొత్తం పోతుంది. అతడి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతుంది. ఆర్థికంగా నష్టపోతాడు. ఈ సంక్షోభం అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కేవలం అతడి జీవితమే కాదు. అతడితో సంబంధం పెట్టుకున్న ఆ ముగ్గురి జీవితాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా అతడి యంగ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతుంది. మరి చివరికి లీ జియాన్ పరిస్థితి ఏమవుతుంది. తిరిగి కోలుకుంటాడా? ఆ ముగ్గురు ఏమవుతారు? తదితర వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ వెబ్ సీరిస్ చూడాల్సిందే. ఈ సీరిస్ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, పిల్లలతో మాత్రం చూడొద్దు. ఇందులో అలాంటి సీన్లు ఉంటాయి.
Also Read: OTT Movie: తనను ప్లేబాయ్‌లా మార్చిన ఆటగాడితో కూతురు ప్రేమలో పడితే? ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు!