Pawan Kalyan Jalsa 4k Re Release Postponed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో జల్సా మూవీ ఒకటి. ఖుషి తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన చిత్రమిది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలియాన, పార్వతి మెల్టర్ హీరోయిన్లుగా.. నటుడు ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, శివాజీలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
సెప్టెంబర్ 3న రీ రిలీజ్
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 3న జల్సా రీరిలీజ్ కాబోతోంది. ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి కారణంగా అల్లు కుంటుంబంలో నెలకొన్న విషాదం. కాగా ఆగస్టు 30 ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. అల్లు కనకరత్నమ్మ మరణంతో అల్లు, మెగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జల్సా మూవీ రీ రిలీజ్‌ని వాయిదా వేయాలని మూవీ టీం నిర్ణయించిందట.
విషాదంలో అల్లు, మెగా ఫ్యామిలీ
జల్సా మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీనికి అల్లు అరవింద్ నిర్మాత. ప్రస్తుతం తల్లి మరణంతో ఆయన తీవ్ర దు:ఖంలో ఉన్నారు. ఈ క్రమంలో జల్సా రీ రిలీజ్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ జల్సా రీ రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మ్యూజికల్ గానూ అందే విజయం సాధించింది. ఈ సినిమాలోని ప్రతి పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యం టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ చేత ఉర్రుతలూగించింది. ఇక మెలోడీ, రొమాంటిక్ సాంగ్స్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో యూత్ అంతా జాల్సా పాటలతో గాల్లో తేలిపోయారనడంలో సందేహం లేదు.
‘జల్సా’ సినిమా విషయానికి వస్తే… సంజయ్ సాహు అనే ఓ యువకుడు తమ గ్రామంలో పెత్తందారులు, భూస్వాముల అరాచకాలకు విసిగిపోయి నక్సలిజంలో చేరుతాడు. ఈ క్రమంలో ఓసారి మంత్రి మీద బాంబు బ్లాస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అదే టైంలో ఆయనను కాపాడుతాడు. దీంతో సదరు మంత్రి సంజయ్ సాహుకి జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఇస్తాడు. అంతేకాదు అతడికి రివార్డును కూడా ప్రకటిస్తాడు. ఆ తర్వాత అడవిలో తనతో పాటు ప్రయాణించిన పోలీస్ అధికారి కుమార్తెను ప్రేమిస్తాడు. మొదటి ఆయన పెద్ద కుమార్తెను(కమలిని ముఖర్జీ) ప్రేమించిన సంజయ్.. అనుకోకుండ చిన్న కూతురు(ఇలియాన) కూడా ప్రేమిస్తాడు. ఆ తర్వాత వారి ప్రేమ విషయం తెలిసి.. పోలీసు అధికారి(ప్రకాష్ రాజ్) ఏం నిర్ణయం తీసుకున్నాడు? వారి పెళ్లికి ఒప్పుకున్నాడా? లేదా అనేది మిగితా కథ.