Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)నేడు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book Of Records)గోల్డ్ ఎడిషన్ లో ఆయన పేరు చేరింది. ఇలాంటి రికార్డు సొంతం చేసుకున్న తొలి నటుడిగా బాలకృష్ణ పేరు నిలిచిపోయింది. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోకి కూడా దక్కని గౌరవం బాలయ్యకు దక్కడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలకృష్ణ తన సినీ కెరియర్ కు 50 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇలా 50 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలకృష్ణ ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పురస్కారం అందుకున్న బాలయ్య..
నేడు హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో భాగంగా బాలయ్యకు ఈ పురస్కారం అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి బండి సంజయ్, నారా లోకేష్ (Nara Lokesh) తో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇలా ప్రముఖుల సమక్షంలో బాలకృష్ణ ఈ పురస్కారం అందుకున్న అనంతరం వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు.
మీకు రుణపడి ఉంటాను…
ఇక వర్షాల కారణంగా రైతుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పంటలు మొత్తం నీటమునగడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని ,వారందరూ త్వరగా కోలుకోవాలని బాలయ్య ఆకాంక్షించారు. అదేవిధంగా తనకు జన్మనిచ్చిన తన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించడమే కాకుండా, తన తల్లిదండ్రుల తర్వాత తన కుటుంబం,తన అభిమానులు సినీ దర్శక,నిర్మాతలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించారని తెలిపారు. ఇక తన మనవళ్లు తనని ఎంతో ముద్దుగా బాల అని పిలుస్తారని, వీరందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలియ చేశారు.
కళకు భాషతో సంబంధం లేదు…
ఇక ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా షూటింగ్స్ కి అనుకూలంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, కళకు భాషతో ప్రాంతంతో సంబంధం లేదని తెలిపారు. ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే చాలా చులకనగా చూసేవారు కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లిందని, తెలుగు వారి సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా నిరూపించుకుంటున్నాము. ఇది మనకెంతో గర్వకారణమని తెలిపారు. అదేవిధంగా తనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సినీ సెలబ్రిటీలు బాలయ్య గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read: Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !