Nandamuri Balakrishna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా 50 సంవత్సరాల అనుభవం బాలకృష్ణకు ఉంది. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తండ్రి నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తండ్రి పేరును నిలబెట్టాడు.
బాలయ్య కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అలానే కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం సినిమాల్లోనే హీరోగా మిగిలిపోకుండా నిజ జీవితంలో కూడా చాలాసార్లు హీరో అయ్యారు బాలయ్య. ఇప్పటికీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చాలామందికి తన సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి తన మానవత్వాన్ని చాటి చెప్పుకున్నారు నందమూరి బాలకృష్ణ.
సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ కూడా 10 లక్షలు విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు డొనేట్ చేశారు. వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. జరిగిన నష్టం దృష్ట్యా.. ఉడత భక్తిగా 50 లక్షలు డొనేట్ చేస్తున్న అని ప్రకటించారు. ఇక ముందు కూడా ఇలా నా సహకారం ఉంటుంది. అని చెప్పారు బాలకృష్ణ.
తాజాగా బాలకృష్ణ 50 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినిమా ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అమితాబచ్చన్ రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే తమ రెస్పాన్స్ తెలియజేశారు.
Also Read : Tvk Party – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో విజయ్ టీవీకే పార్టీ జెండా?