Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 31వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకొండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు. కానీ వారు మీ నుండి కొంత సహాయం ఆశిస్తారు. లక్కీ సంఖ్య: 7
వృషభ రాశి:
మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. ఈరోజు మీ తోబుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీయొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తుంది తప్పదు. మీ కుటుంబం అంతటికీ లబ్దినిచ్చే ప్రాజెక్ట్ లను ఎంచుకొండి. వృద్ధిలోకి వస్తారు. లక్కీ సంఖ్య: 6
మిథున రాశి:
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. వ్యక్తిగతమూ, మరియు విశ్వసనీయమయిన రహస్య సమాచారం బయట పెట్టకండి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతం గడుపుతారు. ఇది మీలోని పాజిటివ్ శక్తిని పెంచుతుంది. లక్కీ సంఖ్య: 4
కర్కాటక రాశి:
విచారంలో ఉన్నవారికి సహాయం చెయ్యండి. ఇతరులకు సహాయం చేయకపోతే జన్మకు సార్థకత లేదని తెలుసుకోండి. తల్లిదండ్రుల సహాయంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వమే మీరు కొత్త స్నేహితులను పొందడానకి వీలు కల్పిస్తుంది. లక్కీ సంఖ్య: 8
సింహరాశి:
మీకు ఎదురు చూడని లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ శరీర బరువు పై ఓ కన్నేసి ఉండండి. ఇతరులను పెద్దగా కష్ట పడకుండానే ఆకర్షిస్తారు. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది. లక్కీ సంఖ్య: 6
కన్యారాశి :
ఈ రోజు రిలాక్స్ అయేలాగ సరియైన మంచి మూడ్ లో ఉంటారు. ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. తల్లిదండ్రులు, మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి శక్తి మేరకు కృషి చేస్తుంటారు. లక్కీ సంఖ్య: 5
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి:
మీ మానసికమైన ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మీ తల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీయొక్క ఆర్థికస్థితిని దెబ్బ తీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. ఈ రోజు మీరు ఒక క్రొత్త ఎగ్జైట్ మెంట్ తోను.. నమ్మకంతోను ముందుకెళ్తారు. మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. లక్కీ సంఖ్య: 7
వృశ్చికరాశి:
ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైమ్. ఎందుకంటే, మీ మానసిక వత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. లక్కీ సంఖ్య: 9
ధనస్సు రాశి:
మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది. దూరపు బంధువుల నుంచి అనుకోని శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ శుభవార్త వల్ల మీ కటుంబంలో సంతోషకరమైన వాతారణం ఉంటుంది. ఎంత సంపాదించినా ఖర్చులు కూడా పెరగడంతో పొదుపు చేయలేకపోతారు. లక్కీ సంఖ్య: 6
మకరరాశి:
ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహముగా ఉంటారు. మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడ నుండి ఐన మీకు ధనము అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. లక్కీ సంఖ్య: 6
కుంభరాశి:
మానసికమైన ఒత్తిడులు ఉంటాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇవాళ మీకు ఎంతో శక్తివంతమైన రోజు. మీరు ఎదురు చూడని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు సమాచారం అందించడానికి ఇవాళ మంచి రోజు. లక్కీ సంఖ్య:1
మీనరాశి:
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీకోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. లక్కీ సంఖ్య: 4
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే