Amitabh Bachchan: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ప్రస్తుతం వరుస సినిమాలు రియాలిటీ షోలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న అమితాబ్ తాజాగా టాలీవుడ్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna)ప్రత్యేకంగా ఒక లెటర్ రాస్తూ ఆయనకు క్షమాపణలు తెలియజేశారు. అసలు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బాలయ్యకు క్షమాపణలు చెప్పడం ఏంటీ? అసలేం జరిగింది? అనే విషయానికి వస్తే… నందమూరి బాలకృష్ణ యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(World Book Of Records) సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ అవార్డును నేడు(ఆగస్టు 30) బాలకృష్ణ అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు.
అమితాబ్ బచ్చన్ కు ప్రత్యేక ఆహ్వానం…
ఈ కార్యక్రమంలో భాగంగా అమితాబ్ బచ్చన్ గారిని కూడా పాల్గొనాలి అంటూ ప్రత్యేక ఆహ్వానం పంపించారు . ఈ ఆహ్వానం అందడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన అమితాబ్ తన KBC షెడ్యూల్ కారణంగా ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి రాలేకపోతున్నానని తెలియజేస్తూ రాసిన లెటర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పాటు తన సినీ ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఇలాంటి గొప్ప పురస్కారాన్ని అందుకుంటున్న నేపథ్యంలో అమితాబ్ అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు మీ నిబద్ధతను, పని పట్ల మీకున్న అంకితభావాన్ని తెలియజేస్తుందని తెలిపారు.
సినీ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి హీరోగా…
ఈ విధంగా బాలయ్య అందుకున్న ఈ పురస్కారం పట్ల అమితాబ్ అభినందనలను తెలియజేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని తెలియజేస్తూ రాసిన ఈ లెటర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక నేడు హైదరాబాద్ లో ఒక హోటల్లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖుల సమక్షంలో బాలకృష్ణ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోనే ఏ ఒక్క హీరో కూడా ఇలాంటి గౌరవాన్ని అందుకోలేదని చెప్పాలి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో బాలయ్య పేరు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని చెప్పాలి.
హాజరైన దర్శక,నిర్మాతలు…
బాలకృష్ణ తన 50 సంవత్సరాల సినీ జీవితంలో ఇండస్ట్రీకి సేవలు చేయడమే కాకుండా బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈయనకు యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. ఇక బాలయ్య ఈ పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు, సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారాలోకేశ్ తదితరులు హాజరయ్యారు. అలాగే బాలయ్యతో సినిమాలు చేసిన దర్శకులు గోపీచంద్ మలినేని, బోయపాటి శ్రీను, బాబి, సంగీత దర్శకులు తమన్ వంటి తదితరులు కూడా హాజరయ్యారు.
Also Read: S.S.Thaman: బాలయ్యను చూడగానే కొట్టాలనిపిస్తుంది.. అంత మాట అనేసావెంటీ తమన్!