Pawan Kalyan : అల్లు అరవింద్ తల్లి అల్లు కనక రత్నం గారు నేడు తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్త వినగానే తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి కి గురి అయింది. ఈవిడ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తగారు కావడం వలన, అందరికంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆ ఇంటికి చేరుకున్నారు.
చివరి కార్యక్రమం పూర్తయినంతవరకు కూడా మెగాస్టార్ చిరంజీవి అక్కడే తన సమయాన్ని కేటాయించారు. ఇక ఈరోజు అల్లు వారి ఇంట్లో చాలామంది సెలబ్రిటీస్ వచ్చి సంతాపం తెలియజేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.
అల్లు వారింటికి పవన్ కళ్యాణ్
అయితే పొద్దున్నుంచి వస్తున్న వీడియోస్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం ఒకపక్క పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల ముందు నుంచే వైజాగ్లో జనసేన సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అందుకే అల్లు అరవింద్ గారి ఇంట్లో పొద్దున్న కనిపించలేదు. అక్కడ సభ పూర్తయిన వెంటనే హైదరాబాద్ చేరుకొని, నేరుగా అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి అల్లు అరవింద్ ఫ్యామిలీ కి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read: Allu Kanakaratnamma : మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అల్లు కనక రత్నమ్మ