BigTV English

OTT Movie: తనను ప్లేబాయ్‌లా మార్చిన ఆటగాడితో కూతురు ప్రేమలో పడితే? ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు!

OTT Movie: తనను ప్లేబాయ్‌లా మార్చిన ఆటగాడితో కూతురు ప్రేమలో పడితే? ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు!

OTT Movies: మీకు మంచి కామెడీతో కూడిన రొమాంటిక్.. ఫీల్ గుడ్ మూవీ చూడాలని ఉందా? అయితే, తప్పకుండా ఈ మూవీ ట్రై చెయ్యండి. ఈ సినిమా పాతదే.. కానీ, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ పేర ‘క్రేజీ స్టుపిడ్ లవ్’ (Crazy Stupid Love). 2011లో రిలీజ్ అయిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. ఈ కథ అంతా కాల్ వీవర్ (స్టీవ్ కరేల్) అనే మధ్యవయస్సుడి చుట్టూ తిరుగుతుంది.


ఇదీ కథ:

కాల్ ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్. అతడి భార్య పేరు ఎమిలీ (జూలియన్ మూర్). కాల్‌కు ఇద్దరు పిల్లలు ఉంటారు. అయితే ఒక రోజు ఎమిలీ.. తనతో పనిచేసే.. డేవిడ్ లిండ్‌హాగన్ (కెవిన్ బేకన్)తో సంబంధం పెట్టుకున్నట్లు కాల్‌కు తెలుస్తుంది. తనకు విడాకులు కావాలని కోరుతుంది. దీంతో కాల్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేడు. అప్పటి నుంచి కాల్ బార్‌లో తాగుతూ.. తన బాధను అందరికీ చెప్పుకుంటాడు.


జాకబ్ రాకతో.. అంతా తారుమారు

ఆ బార్‌లో కాల్‌కు జాకబ్ పాల్మర్ (ర్యాన్ గోస్లింగ్) అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఇతడు మాంచి అందగాడైన ప్లేబాయ్. అతడంటే అమ్మాయిలు పడి చస్తారు. కాల్ దయనీయ స్థితిని చూసి జాకబ్.. అతడిని మనిషిలా మార్చాలని అనుకుంటాడు. డేటింగ్ నైపుణ్యాలు నేర్పుతాడు. దీంతో జాకబ్ సలహాలతో కాల్ తన లుక్ మొత్తం మార్చేసుకుంటాడు. మహిళలతో మాట్లాడటం నేర్చుకుంటాడు. ఆత్మవిశ్వాసం పొందుతాడు. అమ్మాయిలతో డేటింగులు చేస్తాడే గానీ.. మనసు మాత్రం తన భార్య ఎమిలీ వైపే ఉంటుంది.

టీనేజర్‌తో ప్రేమాయణం

కథ అలా సాగుతున్న సమయంలో ఓ కొత్త ప్రేమ కథ పుడుతుంది. కాల్ తన పిల్లల కోసం జెస్సికా (అనాలి టిప్టన్) అనే బేబీ సిట్టర్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే, కాల్ 13 ఏళ్ల కొడుకు (జోనా బోబో) జెస్సికా ప్రేమలో పడతాడు. కానీ, జెస్పికాకు కాల్ అంటే ఇష్టం. వీరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. భావోద్వేగంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా కొడుకు జెస్సికాను ముగ్గులోకి లాగాని చూస్తే.. జెస్పికా అతడి తండ్రిని లైన్‌లో పెట్టే ప్రయత్నాలు బాగుంటాయి.

బుద్ధిమంతుడిగా మారిపోయే ప్లేబాయ్

మరోవైపు కాల్‌కు ప్రేమ పాఠాలు నేర్పిన జాకబ్.. అనుకోకుండా హన్నా (ఎమ్మా స్టోన్) అనే యువతి ప్రేమలో పడతాడు. అయితే హన్నా మొదట జాకబ్ వేషాలకు లొంగదు. కానీ జాకమ్ మెల్లమెల్లగా ఆమెను మాత్రమే ప్రేమిస్తాడు. ఏ అమ్మాయిల వైపు చూడడు. దీంతో ఇద్దరి మధ్య క్రమేనా ప్రేమ చిగురిస్తుంది. నిజమైన ప్రేమను పొందుతాడు. అయితే, ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంటుంది. హన్న కథ ఎవరని తెలిశాక మైండ్ బ్లాక్ అవుతుంది.

కాల్ కూతురే హన్నా…

కాల్ కూతురే హన్నా అని తెలిశాక.. కథ మరో మలుపు తిరుగుతుంది. తనకు రొమాంటిక్ పాఠాలు నేర్పిన జాకబ్ తన కూతురికి బాయ్ ఫ్రెండ్ అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. జాకబ్‌ను అంగీకరించలేకపోతాడు. మరోవైపు ఎమిలీ.. తాను విడాకులు తీసుకోవాలా వద్ద అనే సందేహంలో ఉంటుంది. కూతురు విషయంలో భర్తకు సాయం చేయాలని అనుకుంటుంది. మరి చివరికి కాల్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? హన్న, జాకబ్‌ల ప్రేమకు అంగీకరించారా అనేది క్లైమాక్స్. ఈ మూవీ స్టోరీ అడల్ట్ కంటెంట్‌లాగే ఉంటుంది. కానీ, మీరు కోరుకొనే సీన్లు మాత్రం ఉండవు. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభవం కలుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అజ్ఞాత వ్యక్తి నుంచి గిఫ్ట్స్… అమ్మాయే కదాని కిడ్నాప్ చేస్తే, నరకం చూపించే లేడీ సైకో… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా

OTT Movie : మనుషులపై మోహం… ఏ మగాడినీ వదలని ఏలియన్… చిన్నపిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : మూవీలో ఆ సీన్స్ ఉండాలని పట్టుబట్టే అమ్మాయి… సమ్మర్ హాలీడేస్ లో సినిమా ప్లాన్… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి బుర్రపాడు

OTT Movies: ఆఫీసులో బాస్ రహస్య జీవితం.. ఏకంగా ఇద్దరు అమ్మాయిలతో.. ఒక్క వీడియోతో మొత్తం మటాష్!

OTT Movie : కూతురి చావుకి ప్రెగ్నెన్సీ తో రివేంజ్… ప్రాణాల మీదకి తెచ్చే దొంగతనం… నరాలు తెగే ఉత్కంఠ

Big Stories

×