Pooja Hegde: సౌత్ ఫిల్మ్ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని హీరోయిన్ పూజా హెగ్డే.

పుట్టి పెరిగింది.. ముంబై అయినా, కన్నడ బ్యూటీగానే గ్లామర్ ఇండస్ట్రీలో ముద్రపడిపోయింది.

రెండేళ్ల తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ. అప్పుడప్పుడు బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతోంది.

ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేకపోయినా మెల్లగా ఫోటోషూట్లతో నెట్టుకుంటూ వచ్చేసింది.

కాకపోతే వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్‌ను ఫుల్ చేసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది.

ఈ పాపను టాలీవుడ్ దూరంగా పెట్టిందా? లేక ఈమె దూరమైందా అనేది మరో పాయింట్.

ఇండస్ట్రీకి వచ్చిన పుష్కరకాలం గడిచిపోవడంతో మ్యారేజ్ ఎప్పుడంటూ రైజ్ చేయడం అభిమానుల వంతైంది.

అన్నట్లు గోల్డ్ కలర్ శారీలో చేసిన ఫోటోషూట్‌లో ఈ పాప మెరిసిపోయింది.

డ్రెస్సుకు తగ్గట్టుగా జ్యువెలరీ, ఇక లైటింగ్ ఇవ్వన్నీ కలిసి మిల మిల మెరిసిపోయింది పూజా. వాటిపై ఓ లుక్కేద్దాం.