Poonam Bajwa: ఆండాళ్ ముద్దగుమ్మ పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సినిమాలు తక్కువ చేసినా కూడా పూనమ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అయితే అసలు చెప్పనవసరం లేదు.
నవదీప్ నటించిన మొదటి సినిమా అనే సినిమాతో పూనమ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సినిమా విజయం పక్కన పెడితే అమ్మడి అందానికి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక నాగార్జున, నయనతార నటించిన బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పూనమ్ కనిపించి మెప్పించింది. ముద్దుగా బొద్దుగా కనిపించడంతో ఈ చిన్నదానికి తిరుగులేదు అనుకున్నారు.
అయితే పూనమ్ కు తెలుగు నుంచి ఎక్కువ ఛాన్స్ లు రాలేదు. దీంతో ఆమె కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ గ్లామర్ ను ఒలకబోసే పాత్రల్లో కనిపించి స్టార్ గా మారింది.
ఇక పూనమ్ సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిన్స్ అంటే మేకప్ తో కనిపిస్తేనే అందంగా ఉంటారు అనే మాటను పూనమ్ చెరిపేసింది.
నిత్యం తాను చేసే పనులనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మొదలుపెట్టింది. ఉదయమే లేవడం, యోగా చేయడం.. నిద్రలో ఉన్నప్పుడు.. ఇలా ప్రతి యాంగిల్ లో కూడా అందాలను ఆరబోస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ అమ్మడికి భక్తులుగా మారిపోయారు.
తాజాగా పూనమ్ థైస్ అందాలను ఎరగా వేసి సోషల్ మీడియాను హీటెక్కించింది. ఒక చిన్న ఉయ్యాలలో చిన్న నిక్కర్.. బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని.. గాగుల్స్ పెట్టుకొని యమా హాట్ గా కనిపించింది.
ఇక ఈ ఫోటోలు చూసిన కుర్రకారు ఆగుతారా.. అమ్మడి థైస్ షోకు మెస్మరైజ్ అయ్యిపోయి నెట్టింట వైరల్ గా మార్చేశారు.