BigTV English
Advertisement

Samantha: కళ్లల్లో కన్నీళ్లు దాస్తూ.. పైకి నవ్వుతున్నావా సామ్.. అయినా అందంగానే ఉన్నావ్

Samantha: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది సామ్.

మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకొని స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది సమంత. ఇప్పటికీ టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ అంటే సమంతానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సమంత జీవితంలో ఆనందాలు ఎన్ని ఉన్నాయో.. అతను మించిన కష్టాలు ఉన్నాయని చెప్పాలి. ఎంతగానో ప్రేమించి అక్కినేని నాగ చైతన్యని వివాహమాడి అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టింది.

ఇక సమంత ఆనందం చూసి దేవుడు కూడా కుళ్లుకున్నాడో ఏమో.. నాలుగేళ్లు తిరగకుండానే విభేదాల వలన  చై తో సామ్ విడిపోయేలా తలరాతలో రాశాడు. ఇక అప్పటినుంచి ఆమె కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. అందరు ట్రోల్ చేసేవాళ్ళే. విడాకులకు కారణం సమంతానే అని ఎన్నో మాటలు అన్నారు.

ఇక  ఆ ట్రోల్స్ ను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న సమయంలోనే మయోసైటిస్ వ్యాధి బయటపడింది. నిత్యం ట్రీట్ మెంట్  తీసుకుంటూ సామ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఇక ఈ మధ్య కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె మనసును మరింత గాయం చేసాయనే చెప్పాలి. అయినా వాటిని దిగమింగుకొని సామ్  ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా నిలబడింది.

తాజాగా సమంత.. జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. ఆమె నవ్వుతున్నా.. ఆమె కళ్లలో కన్నీళ్లు అభిమానులకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె గురించి సెలబ్రిటీలు మాట్లాడుతున్న సమయంలో సామ్ ఎమోషనల్ అయ్యింది.

డిజైనర్  బాడీ కాన్ డ్రెస్ లో సామ్ ఎంతో అందంగా, స్టైలిష్  గా కనిపించింది.  ఈ చిన్నదాని నవ్వు కోసం ఫ్యాన్స్  ఎంతగానో ఎదురుచూసారు అంటే అతిశయోక్తి కాదు.

సామ్..  అలా నవ్వుతూ కనిపిస్తుంటే.. ఫ్యాన్స్  అందరూ.. అలా  నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సమంత ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

×