Regena Cassandra(Image credit: Instagram)
రెజీనా కసాండ్రా.. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో ప్రధానంగా పనిచేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.. తన అద్భుతమైన నటనతో సైమా అవార్డ్స్, సినీ మా అవార్డ్స్ తో పాటు ఫిలిం ఫేర్ ఓటిటి అవార్డ్స్ కూడా దక్కించుకుంది. అంతేకాదు నామినేషన్స్ తో పాటు పలు ప్రశంసలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Regena Cassandra(Image credit: Instagram)
కంద నాల్ ముదల్ అనే తమిళ చిత్రం ద్వారా 2005లో నటన రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా తర్వాత శివా మనసులో శృతి అనే సినిమా చేసి మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఉత్తమ మహిళా అరంగేట్రానికి సైమా అవార్డు కూడా అందుకుంది.

Regena Cassandra(Image credit: Instagram)
ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Regena Cassandra(Image credit: Instagram)
ఇక ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానల్ లో ఢీ డాన్స్ షో కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక్కడ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

Regena Cassandra(Image credit: Instagram)
ఇదిలా ఉండగా ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు పంచుకుంది.

Regena Cassandra(Image credit: Instagram)
వాలెంటైన్స్ డే స్పెషల్ లో భాగంగా రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె లవ్ సింబల్ బెలూన్స్ తో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. అసలైన ప్రేమకు చిహ్నం అనేలా తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది రెజీనా.