E-Paper
Advertisement

మీరు మీరు తిట్టుకోండ్రి.. త‌న్నుకోండ్రిరా బై! మ‌ధ్య‌లో మా కేసీఆర్‌, కేటీఆర్‌ను గుంజుతుండ్రెందుకు?

మీరు మీరు తిట్టుకోండ్రి.. త‌న్నుకోండ్రిరా బై! మ‌ధ్య‌లో మా కేసీఆర్‌, కేటీఆర్‌ను గుంజుతుండ్రెందుకు?
Advertisement

మీరు మీరు కొట్టుకోండ్రి. త‌న్నుకోండ్రి. మ‌ధ్య‌లో మాకాడికెందుకొస్తుర్రా బై. సమ‌జైత లేదు. కిష‌న్‌రెడ్డిని తిట్టాల‌నుంటే మా పెద్ద‌సారు తిట్టిన‌ట్టు హౌలగాడు.. వేస్టుగాడు..! అని తిట్టిన‌ట్టు తిట్టుకో. ఇంకా తిట్లు కావాలంటే మా సారు బూతు పురాణాల పాత వీడియోలు చూసి నేర్చుకో! గా కిష‌న్‌రెడ్డి .. కేటీఆర్ చెప్పిన‌ట్టు ఇంట‌డు..!అనుడేందీ! ఇంటే ఇన్న‌డు కావొచ్చు. అద‌ప్పుడు. ఇప్పుడెందుకింట‌డు బై. అంటే మా ఇద్ద‌రినీ క‌లిపి తిట్టాల‌నుకుంటే.. స‌ప‌రేట్ స‌ప‌రేట్‌గా తిట్టు.. అంతేగానీ ఏమాత్రం విలువియ్య‌కుండా.. కిష‌న్‌రెడ్డిని తిట్టిన తిట్ల‌తో క‌లిపి తిట్ట‌కు.

మా కేటీఆర్ కాబోయే సీఎం! ఇది కొద్దిగా మ‌న‌సుల పెట్టుకుని ఆ మ‌ర్యాదియ్యుర్రి. ఇగ గీ కిష‌న్‌రెడ్డికి కూడా మూతిమ‌తి త‌ప్పిన‌ట్టుంది. అన్ని మాట‌లు తిడితే.. బదులుగా ఓ మూడొంతులు ఎక్కువ తిట్టాలె గదా! మ‌ధ్య‌లో మ‌ళ్లీ పెద్ద‌సారు తెరువెందుకొచ్చిన‌ట్టు! నేనేమ‌న్నా కేసీఆర్ అనుకుంటున్నావ..? నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌టానికి! అన్న‌డు. అంటే మా కేసీఆర్ సారు గా రేవంత్ తిట్ల‌క‌కు గ‌జ్జున ఒణుకుతున్న‌డ‌ని నీ ఫీలింగా? రేవంత్ రెడ్డి నోటికి భ‌య‌ప‌డి గా ఫామ్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు సుక వొస్త‌లేడ‌ని జ‌నాల‌కు చెప్తున్న‌వా? ఒక్క‌టి తిడితే వంద అందుకుంట‌డ‌ని భ‌య‌ప‌డే అసెంబ్లీకి వొస్త‌లేడ‌ని గుర్తు చేస్తున్న‌వ? ఏందీ వ‌యా అస‌లు నీ సంగ‌తి!

Advertisement

మీరు మీరు మంచిగున్న‌రు.. మ‌ధ్య‌లో మ‌మ్మ‌ల్ని హౌలాగాళ్ల‌ను చేస్తుండ్రు! అంటే నేను బీఆరెస్‌తో సీక్రెట్ దోస్తానా చేస్త‌లేను..! అని చెప్ప‌నీకి.. మ‌ధ్య‌లో కేసీఆర్ లెక్క భ‌య‌ప‌డ‌త‌నా! అని అంటుండు కిష‌న్‌రెడ్డి. ఆ ముచ్చేటేదో సూటిగా చెప్పేయరాదు. వాళ్ల‌కు మాకు సంబంధం లేదు.. మేము వాళ్లు ఒక్క‌టి కాదు.. క‌ల‌వం.. క‌లిసి పోటీ చెయ్యం.. పోశ‌మ్మ మీద ఒట్టు..! భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి మీద ఆన‌! అని జ‌నాల‌కు జవాబిచ్చుకో. మ‌ధ్య‌లో ఒక‌లేమో కేటీఆర్‌ను బ‌ద్నాం చేస్త‌డు. ఇంకొక‌లు.. కేసీఆర్‌ను పిరికోడంట‌రు.. ఎలుక‌కు చ‌నువిస్తే పిల్లి నెత్తికెక్కిందంట‌! అట్లుంది ఈళ్ల య‌వ్వారం!

పెద్ద‌సార్ దేశ్‌కీ నేత కావాల్సినోడు.. జ‌స్ట్ మిస్స‌య్యింది. చిన్న‌సారు సీఎం కావాల్సినోడు.. అదీ కొద్దిల జారిపోయింది. పీఎం, సీఎం కావాల్సినోళ్ల‌ను ప‌ట్టుకుని.. నోటికేదొస్తే అది.. ఎట్ల‌వ‌డితే అట్ల తిట్టుడేనారా బై. ఇదేం మ‌ర్యాదా? మీరు మీరు తిట్టుకుంటే మేమెన్న‌డైనా మ‌ధ్య‌లొచ్చిన‌మా? మ‌రి న‌డిమిట్ల మా జోలికెందుకొస్తుర్రు. అస‌లే మా టైం బాగ‌లేక‌.. పెద్ద‌సారు ఆడ‌.. చిన్న‌సారు ఈడ అన్న‌ట్టు గుట్ట‌కొక‌లు.. పుట్ట‌కొక‌లు అయినం. అయినా మీ కండ్లు స‌ల్ల‌వ‌డ్త‌లేవా.. రేవంతు..! కిచ‌నాలు!

Advertisement

ఓ రేవంతు.. ఇగ చూస్తం నీ అంతు..! కిచ‌నాలు.. నువ్వో కురేకురే రెడ్డి.! కిరికిరి రెడ్డి! ఇగ కాస్కోర్రి మాకూ వ‌స్త‌యివ్యా.. తిట్లు. మంచి మాట‌కే మంచోళ్లం. నోరిప్పితే అంతా మూసే.. ! మ‌టాషే! అన‌వ‌స‌రంగా గెల్క‌కుర్రి.. తిట్లువ‌డ‌కుర్రి! ఇదే లాస్ట్ వార్నింగ్‌. ఇగ వార్నింగులుండ‌యి.. డైరెక్టు ఫైరింగులే! స‌మ‌జ‌యిందా!?

Related News

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

Big Stories

Advertisement
×