E-Paper
Advertisement

ప్రాంతీయ భాషల్లో మాట్లాడే AI ఫీచర్లతో Infinix Smart 20.. ఈ ధరలో ఇలాంటి ఫోన్ దొరకడం కష్టమే!

ప్రాంతీయ భాషల్లో మాట్లాడే AI ఫీచర్లతో Infinix Smart 20.. ఈ ధరలో ఇలాంటి ఫోన్ దొరకడం కష్టమే!
Advertisement

Infinix Smart 20 luanch: బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసే ఇన్ఫినిక్స్ సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ‘ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20’ మోడల్‌ను విడుదల చేసింది. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ సామాన్యులకు సైతం అందుబాటు ధరలోనే లభిస్తోంది. ముఖ్యంగా సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్ తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి చక్కని ఆప్షన్ కానుంది.

ధర వివరాలు ఇలా..

భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా.. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఈ ఫోన్ క్లౌడ్‌లైన్ బ్లూ, పోలారిస్ టైటానియం, షాడో బ్లాక్, సన్‌లైక్ ఆరెంజ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 12 నుంచి దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అదనంగా రూ.500 వరకు బ్యాంక్ ఆఫర్లు కూడా లభించే అవకాశం ఉంది.

అత్యంత స్లిమ్ డిజైన్..

Advertisement

ఈ ఫోన్ కేవలం 7.7 మిల్లీమీటర్ల మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. చేతిలో పట్టుకుంటే మంచి గ్రిప్ ఇచ్చేలా వెనుక వైపు 3D టెక్స్చర్ డిజైన్ ఇచ్చారు. అలాగే దీనిలో 6.78 ఇంచుల పెద్ద హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పైన నీరు లేదా ఆయిల్ పడినా కూడా టచ్ స్క్రీన్ చక్కగా పనిచేయడం దీని ప్రత్యేకత. అంతేకాకుండా.. నోటిఫికేషన్ల కోసం ఇందులో డైనమిక్ బార్ ఫీచర్‌ను కూడా చేర్చారు.

Also Read: సరికొత్త ‘మింట్’ కలర్‌లో Samsung Galaxy A27.. లాంచ్‌కు ముందే లీకైన వివరాలు!

ప్రాంతీయ భాషల్లో ఏఐ రైటింగ్..

Advertisement

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్ మీడియాటెక్ హెలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఈ ఫోన్ ఏకంగా 48 నెలల పాటు ఎలాంటి లాగ్ లేకుండా స్మూత్‌గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఇందులో ‘ఫోలాక్స్’ వాయిస్ అసిస్టెంట్ ఆధారంగా పనిచేసే ఇన్ఫినిక్స్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

ఇంటర్నెట్ లేకపోయినా కాల్స్..

పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా హిందీ, తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో ఏఐ రైటింగ్, ఏఐ ఎరేజర్, వాల్‌పేపర్ జనరేటర్ వంటి స్మార్ట్ ఫీచర్లను వాడుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా 1 కిలోమీటర్ దూరం వరకు ఉచితంగా కాల్స్, మెసేజ్‌లు చేసుకునే ‘అల్ట్రా లింక్’ ఫీచర్ ఇందులో ఉండటం విశేషం.

కిందపడినా పగలదు..

ఈ Infinix Smart 20 ఫోన్ వెనుక వైపు ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్న 8MP కెమెరా, ముందు వైపు సెల్ఫీల కోసం 8MP కెమెరాను ఇచ్చారు. నైట్ మోడ్, పోర్ట్రెయిట్, వ్లాగ్ మోడ్ వంటి కెమెరా ఫీచర్లు దీనిలో ఉన్నాయి. అలాగే ఇందులో 5,200mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే ఛార్జర్‌ను కూడా ఇస్తున్నారు. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP64 రేటింగ్ ఇచ్చారు. దాదాపు 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా తట్టుకునేలా ఈ ఫోన్‌ను బలంగా డిజైన్ చేశారు.

Also Read: Siriకి సూపర్ పవర్స్.. WWDC 2026లో యాపిల్ ఏం ప్రకటించబోతోంది? ఈవెంట్ లైవ్ ఎలా చూడాలంటే?

Related News

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!

Big Stories

Advertisement
×