E-Paper
Advertisement

వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ
Advertisement

YS Vijayamma Birthday: ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయా? జగన్ విడిచిన అవకాశాన్ని టీడీపీ వినియోగించుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? తాజాగా వైఎస్ విజయమ్మకు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై ఆ పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్ 

Advertisement

రాజకీయాలు వేరు.. ఫంక్షన్ల సందర్భం వేరని నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉంటాయని, అంతా ఒక్కటేనని మరికొందరు చెబుతారు. తాజాగా దివంగత వైఎస్ఆర్ సతీమణి విజయమ్మకు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రాజకీయ నేతలు, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా విజయమ్మకు బర్త్‌డే విషెస్ చెప్పారు. వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని తన పోస్టులో పేర్కొన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

Advertisement

రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ.. గమనిస్తున్న వైఎస్ఆర్ అభిమానులు

ఏపీలో రాజకీయంగా భిన్న ధ్రువాలైన నేతలు ఈ విధంగా శుభాకాంక్షలు చెప్పడం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు చెప్పడం మంచి సంప్రదాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం దీని వెనుక ఏదో ఉందంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఆస్తుల విషయంలో విజయమ్మ-జగన్ చిన్నపాటి మనస్పర్థలు కొన్నాళ్లుగా తలెత్తాయి. ఈ విషయంలో జగన్ వ్యవహారశైలిని చాలామంది తప్పుబట్టారు.  దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో టీడీపీ నిమగ్నమైనట్టు ప్రత్యర్థుల నుంచి మాటలు వెలువడుతున్నాయి.  వైఎస్ అభిమానులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోందని కొందరు నేతల మాట.

ALSO READ: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీజేపీలోకి మల్లారెడ్డి ఫిక్స్..?

 

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

Big Stories

Advertisement
×