Black Magic: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో క్షుద్ర పూజలు ( Black Magic) జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్షుద్ర పూజలు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( ( Sunrisers Hyderabad ) అభిమానులు ఓడించారని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. క్షుద్ర పూజలు చేయడం కారణంగానే శివమ్ దూబే ( Shivam Dube ) నుంచి మొదలు కొని చివరి వరకు అన్ని వికెట్లు తొందరగానే పడిపోయాయని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై విచారణ చేయాలని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు కూడా చేసిందట చెన్నై సూపర్ కింగ్స్. ఈ మేరకు బీసీసీఐకి ఫిర్యాదు చేసిన ఓ లేక వైరల్ గా మారింది. దీంతో ఈ క్షుద్ర పూజలకు అంశం హాట్ టాపిక్ అయింది.
Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్లలో రబ్బర్లు…అందుకే అవలీలగా సిక్సులు, బౌండరీలు కొడుతున్నాడు
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad vs Chennai Super Kings) మధ్య నిన్న ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చివరి వరకు పోరాడిన హైదరాబాద్, ఎట్టకేలకు విజయం సాధించింది. చివరి ఓవర్ లో జేమీ ఓవర్టన్ ఔట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో మంచి టచ్ లో ఉన్న శివమ్ దూబే ఔట్ కావడం హాట్ టాపిక్ అయింది. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ అభిమాని నిమ్మకాయతో క్షుద్ర పూజలు చేసినట్లుగా వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత వెంటనే శివమ్ దూబే ( shivam dube) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన క్షుద్ర పూజల కారణంగానే సీఎస్కే ఓడిపోయిందని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ క్షుద్ర పూజల అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం లేఖ రాసినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి క్షుద్ర పూజలు ( Black magic) కారణమని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేక ఇప్పుడు వైరల్ గా మారడం వివాదానికి తెర లేపుతోంది. అయితే క్షుద్ర పూజలను ఇంకా నమ్ముతున్నారా ? ఏ కాలంలో ఉన్నారు ? కొంచమైనా సిగ్గుండాలి అని చెన్నై సూపర్ కింగ్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగులు చేయడం చేతకాక ఇలా క్షుద్ర పూజలని నాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు.
మంత్రాలకు వికెట్లు పడతాయా ?#IPL #CSK #SRH #BlackMagic pic.twitter.com/f6vqwFqRZt
— TVR Media 🚩🚩🚩🇮🇳 (@Tvr_Media7) April 19, 2026
. @ChennaiIPL lodged a complaint with @BCCI https://t.co/kvPTdZNCn1 pic.twitter.com/XsPOAWu9cJ
— Maximus Chaturvedi 🪷 (@PsychoSainik) April 19, 2026