E-Paper
Advertisement

బీజేపీలో ఎమ్మెల్సీ గుబులు.. ఆశావాహుల్లో టెన్షన్ టెన్షన్.. అధిష్టానం సపోర్ట్ ఎవరికి?

బీజేపీలో ఎమ్మెల్సీ గుబులు.. ఆశావాహుల్లో టెన్షన్ టెన్షన్.. అధిష్టానం సపోర్ట్ ఎవరికి?
Advertisement

BJP MLC Candidates: రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం బీజేపీలో ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేసిన పార్టీ నాయకత్వం.. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి చొప్పున ఆశావహుల పేర్లతో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు జరిగే ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ జాబితాను అధిష్ఠానానికి పంపించే అవకాశం ఉంది. దీంతో ఆశావహుల్లో రాజకీయంగా ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ

ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్న నేతల పేర్లను పరిశీలించి, అర్హతలు, పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జాబితా రూపొందించనున్నట్లు సమాచారం. ఎన్నికల కమిటీ సమావేశంలో పేర్లపై చర్చించి, ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి సిఫారసు చేసే అవకాశముంది. తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకోనుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడేలా పలువురు నేతలు ముఖ్య నాయకులను కలుస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఆ స్థానంపైనే ప్రధానంగా ఫోకస్!

Advertisement

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీజేపీలో అంతర్గత పోటీ ఆసక్తికరంగా మారినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయ వర్గాల సమస్యలు, సంఘం ప్రాతినిధ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే స్థానం కోసం బీజేపీకి చెందిన మరో నేత సైతం గట్టిగా పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ స్థానం ఎవరికి దక్కుతుందన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆశావహుల ప్రతిపాదనలు, పార్టీ రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణలను బేరీజు వేసుకున్న తర్వాతే అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సునీల్ బన్సల్ ఎంట్రీ

మరోవైపు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ సునీల్ బన్సల్ శనివారం తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయవచ్చని తెలుస్తోంది.

Advertisement

Also Read: ఏపీకి ‘అర్ణబ్’ తుఫాను ముప్పు.. రేపటికి తీవ్ర వాయుగుండం.. డేంజర్ జోన్‌లో ఆ జిల్లాలు!

అధిష్టానం సపోర్ట్ ఎవరికి?

కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ.. ఇలా కీలక అంశాల నేపథ్యంలో బీజేపీ వర్గాల్లో తాజా పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలాఉండగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుంది? ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సునీల్ బన్సల్ పర్యటనలో రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి దిశానిర్దేశం అందుతుంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read: కలిసిపోని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్న వ్యూహాలు.. ఎవరి దారి వారిదేనా?

Tags

Related News

కలిసిపోని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్న వ్యూహాలు.. ఎవరి దారి వారిదేనా?

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

విశ్వనగరం అసలు రూపం ముందుంచుతాం..! మా పార్టీ నినాదం ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..!

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!

Big Stories

Advertisement
×