E-Paper
Advertisement

గుడ్డిగా ఏసీ కొనేస్తున్నారా? 1.5 టన్, 2 టన్ల మధ్య తేడా తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం!

గుడ్డిగా ఏసీ కొనేస్తున్నారా? 1.5 టన్, 2 టన్ల మధ్య తేడా తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం!
Advertisement

1.5 Ton vs 2 Ton AC: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే కొత్తగా ఇల్లు కట్టుకున్న వారైనా, పాత ఏసీని మార్చాలనుకునే వారైనా ఏసీ షాపుకు వెళ్లినప్పుడు ప్రధానంగా వారిని ఓ సమస్య వెంటాడుతుంది. అదే 1.5 టన్ ఏసీ కొనాలా? లేక 2 టన్ ఏసీ కొనాలా?. చాలామంది ఎక్కువ కూలింగ్ ఇస్తుందనే అంచనాతో అవసరానికి మించిన పెద్ద ఏసీని కొనేస్తుంటారు. మరికొందరు డబ్బులు ఆదా అవుతాయని చిన్న ఏసీని తెచ్చుకుంటారు. ఈ రెండూ కూడా పొరపాటే. మీ గది పరిమాణాన్ని బట్టి ఏ ఏసీ పర్ఫెక్ట్‌గా సరిపోతుందో, పవర్ బిల్లు ఆదా అవుతుందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకీ టన్ అంటే ఏంటీ?

సాధారణంగా టన్ అనగానే చాలా మందికి బరువు గుర్తుకు వస్తుంది. కానీ ఏసీల విషయంలో ‘టన్’ (Ton) అంటే ఎయిర్ కండిషనర్ బరువు కాదు. అది ఆ ఏసీ కూలింగ్ సామర్థ్యాన్ని (Cooling Capacity) సూచిస్తుంది. ఒక గదిలో ఒక టన్ను మంచు గడ్డను ఉంచితే అది ఎంత కూలింగ్ ఇస్తుందో 1 టన్ ఏసీ కూడా అంతే కూలింగ్‌ను ఇస్తుంది. ఈ లెక్కన 1.5 టన్, 2 టన్ ఏసీలు గదిని ఎంత వేగంగా ఎంత ఎక్కువగా చల్లబరుస్తాయనేది అర్థం చేసుకోవచ్చు.

గది సైజ్‌ను బట్టి ఎంపిక

Advertisement

కొత్త ఏసీ ఎంపికలో గది పరిమాణం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. గది వైశాల్యం 150 చదరపు అడుగుల నుండి 200 చదరపు అడుగుల లోపు ఉంటే 1.5 టన్ ఏసీ చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సాధారణంగా మన ఇళ్లలోని మాస్టర్ బెడ్‌రూమ్‌లు, మీడియం సైజ్ లివింగ్ రూమ్‌లు ఈ పరిమాణంలోనే ఉంటాయి. అలా కాకుండా గది సైజు 200 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉంటే (పెద్ద హాల్స్, జాయింట్ రూమ్స్ వంటివి) ఖచ్చితంగా 2 టన్ ఏసీని ఎంచుకోవాలి.

పై అంతస్తులో ఉంటే..

గది పరిమాణంతో పాటు ఇల్లు ఉన్న పరిస్థితులను బట్టి కూడా 1.5 టన్ లేదా 2 టన్ ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సూర్యరశ్మి నేరుగా పడే టాప్ ఫ్లోర్‌లో ఉంటున్నట్లైతే గది త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో 170 చదరపు అడుగుల గది ఉన్నప్పటికీ 2 టన్ ఏసీని ఎంచుకోవడం బెటర్. అదే విధంగా గదికి పడమర వైపు పెద్ద కిటికీలు ఉండి.. మధ్యాహ్నం ఎండ నేరుగా కిటికీ పై పడుతుంటే.. అక్కడ కూలింగ్ కోసం కాస్త ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ అవసరమవుతుంది. మరోవైపు గదిలో నిరంతరం నలుగురైదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే వారి శరీరం నుండి వచ్చే వేడి వల్ల కూలింగ్ తగ్గవచ్చు. కాబట్టి ఎక్కువ మంది ఉండే హాల్స్ లాంటి వాటికి 2 టన్ ఏసీనే బెటర్ ఆప్షన్ గా నిలుస్తాయి.

కరెంటు ఆదాకు ఏది బెస్ట్

Advertisement

చాలామంది 1.5 టన్ ఏసీ కంటే 2 టన్ ఏసీతోనే అధిక కరెంటు బిల్లు వస్తుందని భయపడతారు. ఇందులో కొంత నిజం ఉన్నా.. టెక్నికల్ గా చూస్తే ఇది సరైన అభిప్రాయం కాదని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు చిన్న గదిలో 2 టన్ ఏసీ పెడితే అది చాలా వేగంగా చల్లబరిచి ట్రిప్ అవుతుంది. అదే పెద్ద గదిలో 1.5 టన్ ఏసీని పెడితే, గదిని చల్లబరచడానికి ఆ ఏసీ కంప్రెషర్ విరామం లేకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల 1.5 టన్ ఏసీయే ఎక్కువ కరెంట్ బిల్లును లాగేస్తుంది. కాబట్టి గదికి తగిన ఏసీని పెట్టినప్పుడే కరెంట్ బిల్లు కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

బడ్జెట్ పరంగా చూస్తే..

మార్కెట్లో బ్రాండ్‌ను బట్టి, స్టార్ రేటింగ్ ని బట్టి 1.5 టన్, 2 టన్ ఏసీల ధరలు మారుతుంటాయి. సాధారణంగా ఒకే బ్రాండ్‌లో 1.5 టన్ ఏసీ ధరతో పోలిస్తే 2 టన్ ఏసీ ధర దాదాపు రూ. 8,000 నుండి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉంటుంది. కేవలం కొనేటప్పుడే కాకుండా భవిష్యత్తులో సర్వీసింగ్, రిపేర్ ఖర్చులు కూడా 2 టన్ ఏసీకి కాస్త అదనంగానే ఉంటాయి. కాబట్టి చిన్న గది కోసమైతే 1.5 టన్ ఏసీ సరిపోతుందని చెప్పవచ్చు. డబ్బు కూడా ఆదా అవుతుంది. అలా కాకుండా రూమ్ పెద్దదై ఉన్నా, టాప్ ఫ్లోర్ అయ్యి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా బడ్జెట్ కొంచెం పెంచుకుని 2 టన్ ఏసీ వైపు వెళ్లడమే బెస్ట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: మీ పాత ఏసీని అమ్మాలా? ఆన్‌లైన్ vs ఆఫ్‌లైన్.. ఎక్కడ ఎక్కువ లాభం?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×