E-Paper
Advertisement

గుడివాడలో తేల్చుకుందాం రా.. కొడాలి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్, బూట్లు తుడిచిన తర్వాతే

గుడివాడలో తేల్చుకుందాం రా.. కొడాలి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్, బూట్లు తుడిచిన తర్వాతే
Advertisement

Vijayawada: వైసీపీలో సీనియర్ నేతలు యాక్టివ్ అవుతున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో ఒకొక్కరుగా లైమ్ లైట్‌లోకి వస్తున్నారా? ఆ జాబితాలో కొడాలి నాని ముందున్నారా? వచ్చే రాగానే టీడీపీ మహానాడు, సీఎం చంద్రబాబు బాణాలు సంధించారా? వాటిని దీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ కొడాలి నాని ఏమన్నారు? ఆయన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల ఎలాంటి కౌంటరిచ్చారు?

కొడాలి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్

Advertisement

వైసీపీ అధికారం పోయిన తర్వాత కనిపించడం మానేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత గుండె ఆపరేషన్ చేయించుకున్న కొడాలి, అడపా దడపా పార్టీ కార్యక్రమాలకు హాజరైనప్పటికీ పెద్దగా యాక్టివ్‌గా లేరు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ రియాక్టివ్ అయ్యారు.

చాలా కాలం తర్వాత బుధవారం విజయవాడలో మీడియా ముందుకు వచ్చారాయన. టీడీపీ మహానాడు నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన ఆయన, మళ్లీ పాత పద్ధతిలో సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఎక్కడైనా కనిపిస్తే వంగి వంగిపోవడం.. పవన్ కళ్యాణ్ కనిపిస్తే కూర్చోవడం, ఆ తర్వాత వీరిద్దర్ని పొగడటమేనని అన్నారు.

Advertisement

గుడివాడలో తేల్చుకుందాం రా.. బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాలు

మీడియా ముందు చంద్రబాబును ఇమిటేట్ చేసి చూపించారు కొడాలి నాని. మైక్ దొరికితే జగన్ గురించి తల్లి, చెల్లి, గొడ్డలి అనడం తప్పా ఈ రెండేళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. సూపర్ సిక్స్‌ని సూపర్ సున్నా చేశారని, ఈ విషయంలో ప్రజలు క్లారిటీగా ఉన్నారన్నారు. చంద్రబాబులా ద్రోహాలు చేయడం, వంగి వంగి దండాలు పెట్టడం జగన్‌‌కు తెలీవన్నారు.

ప్రజల కోసం మోడీనైనా జగన్ ప్రశ్నిస్తారని తేల్చిచెప్పారు. 79 ఏళ్ల వయస్సు లో వంగి వంగి దందాలు పెట్టడం అవసరం ఏమొచ్చింది? లోకేష్ ఉన్న శాఖను సరిగా నడపలేదని, దానిపై చర్చ పెట్టుకోవాలన్నారు. జగన్ చర్చకు రావాలంటే సీఎం చంద్రబాబు రావాలన్నారు. టీడీపీ మహానాడు ఎలా జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

జగన్ ఒక్కటే మైనస్ అని, చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పలేరన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారని, దాన్ని వంగి వంగి నమస్కారాలు పెట్టి పరువు తీశారని ఎద్దేశా చేశారన్నారు. కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ ప్రజలు 53 వేల ఓట్లతో ఓడించినా బుద్ధి రాలేదా అంటూ ప్రశ్నించారు.

ALSO READ: ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు

విజయవాడలో కాదు.. దమ్ముంటే గుడివాడ రా తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. చుట్టూ నలుగుర్ని చూడగానే రీల్స్ గుర్తుకు వస్తున్నాయా? అంటూ ప్రశ్నించారు. కొడాలి యాక్టివ్ కావడం తనకు మంచిదేనని, ఆయన్ని ప్రజలు మరిచిపోయారని గుర్తు చేశారు. విజయవాడ రావడం అక్కడ మాట్లాడి వెళ్లిపోవడం చేస్తున్నారని, ఏమైనా దమ్ముంటే గుడివాడ వచ్చి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు.

కార్పొరేటర్‌గా ఆయన గెలిచే సీన్ లేదన్నారు. పార్టీ నుంచి నిన్ను ఎప్పుడో మాజీ సీఎం తొలగించారని, ఏమైనా పోస్టు ఇస్తారేమోనని మళ్లీ మీడియా ముందుకొచ్చారని వ్యాఖ్యాలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తా అన్నావని, ఎప్పుడు తుడుస్తావో చెప్పాలన్నారు. బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×