E-Paper
Advertisement

Air Cooler Buying Tips: బెస్ట్ కూలర్‌ ఎంచుకునే 4 చిట్కాలు.. వీటిని పాటించకపోతే.. మీ డబ్బు వృథానే!

Air Cooler Buying Tips: బెస్ట్ కూలర్‌ ఎంచుకునే 4 చిట్కాలు.. వీటిని పాటించకపోతే.. మీ డబ్బు వృథానే!
Advertisement

Air Cooler Buying Tips: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పెద్ద ఎత్తున కూలర్లను ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం మార్చిలో అడుగుపెట్టిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూలర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొత్తది కొనుగోలు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కూలర్ కొనే ముందు కొన్ని అంశాలను తప్పనిసరిగా బేరిజు వేసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా.. కూలర్ కొని ప్రయోజనం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ నాలుగు ప్రధానమైన టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గది పరిమాణం

ఏ గదిలో కూలర్ పెట్టాలని భావిస్తున్నారో దాని పరిమాణానికి అనుగుణంగా కూలర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 150-300 చదరపు అడుగులు ఉన్న చిన్న గదులకు పర్సనల్ కూలర్ సరిపోతోంది. 300-600 చదరపు అడుగులు డెసర్ట్ కూలర్ బెస్ట్ ఛాయిస్. వీటిలో ఫ్యాన్ పెద్దదిగా ఉండి ఎక్కువ గాలిని ఇస్తాయి. అలాగే తక్కువ స్థలం ఉన్న గదుల కోసం టవర్ కూలర్ సైతం అందుబాటులో ఉంది. గాలి కాస్త ఎక్కువ ఎత్తులో రావాలని భావించేవారు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు.

కూలింగ్ ప్యాడ్లు

Advertisement

కూలర్లు అందించే కూలర్ సామర్థ్యం వాటిలోని ప్యాడ్లపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రెండు రకాలు ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. మెుదటి రకమైన హానీ కోంబ్ ప్యాడ్లు (Honeycomb Pads).. తేనెతుట్టే ఆకారంలో ఉండి.. ఎక్కువకాలం మన్నిక అందిస్తాయి. వీటి మెయింటెనెన్స్ కూడా తక్కువే. పైగా గాలిని వేగంగా చల్లబరుస్తాయి. మరోవైపు వూల్ పల్ప్/గడ్డి ప్యాడ్లు ఉన్న కూలర్లు సైతం మార్కెట్ లో ఉన్నాయి. ఇవి చౌకగా ఉన్నప్పటికీ ప్రతీ ఏడాది వీటిని మార్చాల్సి ఉంటుంది. హానీకోంబ్ ప్యాడ్లతో పోలిస్తే వీటి కూలింగ్ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుంది.

వాటర్ ట్యాంక్ కెపాసిటీ

కూలర్లు ఎంతసేపు పనిచేయాలన్నది వాటి వాటి వాటర్ ట్యాంక్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. రాత్రంతా హాయిగా పడుకోవాలంటే మాటిమాటికీ నీళ్లు నింపే పని లేకుండా పెద్ద ట్యాంక్ ఉన్న కూలర్‌ను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు చిన్నగదులకు 20-30 లీటర్ల ట్యాంక్ ఉంటే సరిపోతుంది. పెద్ద గదులకు అయితే 50-80 లీటర్ల కేపాసిటీ అవసరం అవుతుంది. ఆటో-ఫిల్ ఫీచర్ ఉన్న కూలర్ తీసుకుంటే ఇంకా మంచిది. నీటి పైపును నేరుగా కనెక్ట్ చేయవచ్చు. దీని వల్ల ట్యాంక్ ఆటోమేటిక్ గా నిండుతుంది.

Advertisement

Also Read: Most Selling Coolers Feb 2026: ఫిబ్రవరిలో హాట్ కేకుల్లా.. అమ్ముడుపోయిన కూలర్లు.. మార్చిలోనూ తగ్గేదేలే!

విద్యుత్ వినియోగం

ప్రస్తుతం మార్కెట్ లో చాలా అడ్వాన్స్డ్ కూలర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్లతో లభిస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో పవర్ కోతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఇంటిలోనే ఇన్వర్టర్ (Inverter Compatibility)పై నడిపించగల కూలర్ ను ఎంచుకోండి. అలాగే బెడ్ మీద నుంచి లేచే పనిలేకుండానే స్పీడ్ మోడ్స్ మార్చుకోవడానికి, టైమర్ సెట్ చేసుకోవడానికి వీలుగా రిమోట్ కంట్రోల్ కూలర్ ను ఎంచుకోవచ్చు. ఇవి విద్యుత్ ను ఆదా చేస్తాయి. ఐస్ ఛాంబర్ ఉన్న కూలర్ ను ఎంచుకుంటే సమ్మర్ లో మరింత చల్లదనాన్ని ఆస్వాదించేందుకు వీలుంటుంది.

Also Read: Iran Conflict: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కొంప ముంచబోతోందా?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×