E-Paper
Advertisement

Body in Deep Freezer: మూసివున్న హోటల్ నుంచి దుర్వాసన.. ఫ్రిజ్ తెరిచి చూస్తే వ్యక్తి శవం, ఎక్కడంటే?

Body in Deep Freezer: మూసివున్న హోటల్ నుంచి దుర్వాసన.. ఫ్రిజ్ తెరిచి చూస్తే వ్యక్తి శవం, ఎక్కడంటే?
Advertisement

Body in Deep Freezer: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అత్యంత దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బక్షి కా తాలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని GCRG కాలేజ్ గేటుకు ఎదురుగా ఉన్న ఒక వెజ్ బిర్యానీ సెంటర్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని షాపులోని డీప్ ఫ్రీజర్‌లో కుక్కి ఉంచారు. నాలుగు రోజుల తర్వాత షాపు తెరిచిన యజమానికి శవం కనిపించడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. య‌జ‌మాని వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడు ఎవరు? అతను అక్కడికి ఎలా వచ్చాడు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాపు మూసి ఉన్న సమయంలోనే ఎవరో కావాలని మృతదేహాన్ని అక్కడ దాచిపెట్టారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బిర్యానీ షాపు యజమాని తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గత 4 రోజులుగా షాపును మూసివేసి ఊరికి వెళ్లారు. తండ్రి కర్మకాండలు ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన.. సోమవారం షాపు తెరిచారు. సాధారణ తనిఖీల్లో భాగంగా షాపులోని డీప్ ఫ్రీజర్‌ను తెరిచి చూడగా అందులో ఒక యువకుడి శవం కనిపించింది. భయాందోళనకు గురైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు షాపు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నాలుగు రోజుల పాటు షాపు తాళం వేసి ఉన్నప్పటికీ నిందితులు లోపలికి ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. స్థానికులను, షాపు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో కాలేజీ సమీపంలోని విద్యార్థులు, నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే ఆ యువకుడు హత్యకు గురయ్యాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది.

Advertisement

Read Also: Amberpet Family Suicide Case: కుటుంబాన్ని బలిగొన్న వడ్డీ వ్యాపారులు.. సూసైడ్ లెటర్లతో బయటపడిన అంబర్‌పేట్‌ మిస్టరీ

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×