E-Paper
Advertisement

Most Selling Coolers Feb 2026: ఫిబ్రవరిలో హాట్ కేకుల్లా.. అమ్ముడుపోయిన కూలర్లు.. మార్చిలోనూ తగ్గేదేలే!

Most Selling Coolers Feb 2026: ఫిబ్రవరిలో హాట్ కేకుల్లా.. అమ్ముడుపోయిన కూలర్లు.. మార్చిలోనూ తగ్గేదేలే!
Advertisement

Most Selling Coolers Feb 2026: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర రోజు రోజుకు పెరుగుతోంది. మార్చి నెలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. అయితే సాధారణంగా సమ్మర్ లో కూలర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. 2026 వేసవిని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి నెల నుంచే కూలర్లను పెద్దఎత్తున ప్రజలు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో అధికంగా సేల్ అయిన కూలర్ మోడల్స్, అవి ఏ కంపెనీకి చెందాయో ఇప్పుడు చూద్దాం.

సింఫనీ (Symphony)

సింఫనీ కంపెనీకి చెందిన కూలర్లు ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున అమ్ముడుపోయినట్లు రిటైర్ వర్గాలు తెలిపాయి. అధునాతన IoT, i-Pure టెక్నాలజీ, ఎనర్జీ సేవింగ్ లో అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు పేర్కొన్నాయి. ఈ కంపెనీకి చెందిన Diet 3D, HiCool i, Sumo 75 XL కూలర్ మోడల్స్ గత నెలలో బాగా సేల్ అయినట్లు వివరించాయి.

క్రాంప్టన్ (Crompton)

Advertisement

నాణ్యమైన, మన్నిక గల కూలర్లకు క్రాంప్టన్ కంపెనీ మంచి గుడ్ విల్ కలిగి ఉంది. రీసెంట్ గా డెసర్ట్ కూలర్లతో తీసుకొచ్చిన క్రాంప్టన్ ఆప్టిమస్ సిరీస్ వినియోగదారుల తొలి ఎంపికగా నిలిచింది. Optimus 65, Ozone 75, Genie మోడళ్ల కూలర్లు గత నెల బాగా సేల్ అయినట్లు తెలుస్తోంది.

బజాజ్ (Bajaj)

బ్రాండ్ పరంగా చూస్తే కూలర్ల అమ్మకాల్లో బజాబ్ మూడోస్థానంలో నిలిచింది. తక్కువ ధర, నమ్మకమైన సర్వీస్ ను అందిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు బజాజ్ కూలర్లపై పెద్ద ఎత్తున ఆసక్తికనబరిచారు. బజాజ్ కు చెందిన PX 97 Torque, DMH 67, DC 2015 మోడల్ కూలర్లను గత నెల ఎక్కువ మంది కొనుగోలు చేశారు.

హావెల్స్ (Havells)

Advertisement

ప్రీమియం డిజైన్ తో పాటు అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ కంపెనీకి చెందిన కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర కంపెనీల కూలర్లతో పోలిస్తే ఇవి చాలా సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతాయి. మెరుగైన కూలింగ్ ను అందిస్తాయి. ఈ నేపథ్యంలో హవెల్స్ కంపెనీకి చెందిన Celia, Freddo, Altima మోడల్ కూలర్స్ గత నెలలో బెస్ట్ సెల్లింగ్ కూలర్లుగా నిలిచాయి.

Also Read: BSNL Holi Offer 2026: బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. యూజర్లకు బంపరాఫర్.. రూ. 997 ప్లాన్ రీఛార్జ్ చేస్తే..!

వోల్టాస్ (Voltas)

టాటా భాగస్వామ్యంతో ఏర్పాటైన వోల్టాస్.. నాణ్యమైన కూలర్లు, ఏసీలను అందిస్తూ మంచి పేరు సంపాదించింది. టాటా గ్రూప్ నుంచి వస్తున్న భరోసా, పవర్ ఫుల్ కూలింగ్ కారణంగా వినియోగదారులు.. వోల్టాస్ కూలర్లు కొనేందుకు గత నెలలో ఆసక్తి కనబరిచారు. ఫలితంగా Grand 72, Slimm 35, JetMax.. వోల్టాస్ లో బెస్ట్ సెల్లింగ్ కూలర్లుగా నిలిచాయి.

Also Read: Iran Conflict: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కొంప ముంచబోతోందా?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×