E-Paper
Advertisement

Crocodile Eggshells: ఏంటీ.. అప్పట్లో మొసళ్లు చెట్లు కూడా ఎక్కేవా? ఇదిగో ఈ గుడ్డే ఆధారం!

Crocodile Eggshells: ఏంటీ.. అప్పట్లో మొసళ్లు చెట్లు కూడా ఎక్కేవా? ఇదిగో ఈ గుడ్డే ఆధారం!
Advertisement

ఒకానొకప్పుడు నది ఒడ్డున ఉన్న చెట్టు మీద ఓ కోతి ఉండేది. తియ్యటి పండ్లు తింటూ పెరిగేది. కొన్ని పండ్లను నదిలోకి విసిరేది. వాటిని నీళ్లలో ఉన్న మొసలి తింటూ ఉండేది. కొద్ది కాలం తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మొసలి తన భార్యను కూడా సరిగా పట్టించుకోకపోవడంతో.. దానికి కోపం వచ్చింది. ఎలాగైనా కోతిని లేకుండా చేయాలని భావిస్తుంది. తనకు తలనొప్పిగా ఉందని, కోతిగుండెతో తన తలనొప్పి తగ్గుతుందని చెప్తుంది. వెంటనే కోతిని తీసుకుని మొసలి తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లాక మొసలి భార్య చెప్పింది విని అసలు విషయం అర్థం చేసుకుంటుంది కోతి. వెంటనే “నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది. నా గుండెకాయను చెట్టుమీద పెట్టి వచ్చాను”అని చెప్తుంది. వెంటనే తనను చెట్టు దగ్గరికి తీసుకెళ్తే గుండెను ఇస్తానని చెప్పడంతో.. మొసలి మళ్లీ తీసుకెళ్తుంది. కోతి వెంటనే చెట్టు ఎక్కుతుంది. తనను చంపేందుకు మొసలి భార్య చేసిన కుట్ర గురించి చెప్తుంది. తన పిచ్చి పనికి మంచి మిత్రుడిని కోల్పోయానని బాధపడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే.. ఒకవేళ మొసలికి చెట్టు ఎక్కే సామర్థ్యం ఉంటే ఈ కథే ఉండేది కాదేమో! కానీ తాజాగా ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. మొసళ్లు భూమ్మీద ఉండే చెట్టు మీద ఉన్న వాటిని వేటాడేవని వివరించే ప్రయత్నం చేశారు.

ఇంతకీ  క్వీన్స్‌ ల్యాండ్ పరిశోధకులు ఏం చెప్పారంటే?

తాజాగా క్వీన్స్ ల్యాండ్ పరిశోధకులు దేశంలోని పురాతనమైన మొసలి గుడ్డు పెంకులను గుర్తించారు. వీటిని పరిశీలించి మొసళ్ల గురించి ఆసక్తిర విషయాలను వెల్లడించారు. బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ కాటలా డి పాలియోంటాలజియా మిక్వెల్ క్రూసాఫాంట్ నేతృత్వంలోని బృందం బ్రిస్బేన్ సమీపంలోని ముర్గాన్‌ లో పురాతన మొసలి గుడ్డు శిలాజాలను కనుగొంది. ఈ గుడ్డు పెంకులు మెకోసుచైన్ మొసళ్లకు చెందినవిగా తెలిపారు. ఇది దాదాపు 55 మిలియన్ సంవత్సరాల క్రితం భూమ్మీద నివసించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీలో ప్రచురించారు.

మెకోసుచైన్ మొసళ్ల ప్రత్యేకత ఏంటి?

Advertisement

న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మైఖేల్ ఆర్చర్ చెప్పిన విషయాల ప్రకారం.. మెకోసుచైన్ మొసళ్ళు ఐదు మీటర్ల పొడవు వరకు పెరిగేవి. చెట్ల మీద ఉన్న వాటిని కింది నుంచే వేటాడేవన్నారు. “ఇది వినిడానికి వింతగా ఉండవచ్చు. కానీ, వాటిలో కొన్ని భూమిపై ఉంటూ చెట్ల మీద ఉన్న జీవులను వేటాడేవి. వాటి ప్రవర్తనను చిరుతపులి మాదిరిగా ఉండేది” అని ఆర్చర్ చెప్పుకొచ్చారు.

గుడ్డు పెంకులు ఏం చెప్తున్నాయి?    

మెకోసుచైన్ మొసలి గుడ్డు శిలాజాలు సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నట్లు అధ్యయన ప్రధాన రచయిత జేవియర్ పనాడెస్ ఐ బ్లాస్ చెప్పారు. “ఏ రకమైన మొసళ్లు వాటిని పెట్టాయి? అవి ఎక్కడ గూడు కట్టుకున్నాయి? ఎలా సంతానోత్పత్తి చేశాయి? అనే విషయాలను వెల్లడిస్తున్నాయి” అని  వివరించారు. ఈ వివరాలతో శాస్త్రవేత్తలు పురాతన మొసళ్ల పునరుత్పత్తి, అనుకూలతను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయన్నారు. ఈ మొసళ్ళు సుమారు 3,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా నుంచి అదృశ్యమయ్యాయని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: ఆఫీసులోనే ఆ పనులు కానిచ్చేస్తున్న ఇండియన్స్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్!

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×