Jolly LLB 3:థియేటర్లలో అలరించే ఏ సినిమా అయినా సరే ఓటీటీలోకి వస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఆయా చిత్ర నిర్మాతలు కుదుర్చుకున్న డీల్ ని బట్టి కొంతమంది ఓటీటీ లో విడుదల చేస్తే.. మరి కొంతమంది నేరుగా యూట్యూబ్లో రిలీజ్ చేసి ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అయితే అలా థియేటర్లలో వచ్చిన నాలుగు వారాలకు లేదా ఎనిమిది వారాలకు ఆయా సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తూ ఉంటాయి. అయితే మరికొన్ని సరైన డీల్ కుదరక ఓటీటీలోకి రావడానికి సంవత్సరాలు కూడా పడుతుందనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా కామెడీ, హారర్, ఫ్యామిలీ, ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్, స్పై ఇలా ఏ జోనర్లో కావాలన్నా సరే ఆ జోనర్లో మనకు ఓటీటీలలో సినిమాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి మరో కొత్త సినిమా సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లీగల్ కామెడీ చిత్రం జాలీ ఎల్.ఎల్.బి 3 ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాన్ని ఈ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా..
ALSO READ:Rashmika – Vijay: ఇట్స్ అఫీషియల్… స్టేజ్ పైనే రష్మికకు ముద్దుపెట్టిన విజయ్ దేవరకొండ!
అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో వచ్చిన జాలీ ఎల్.ఎల్.బి, జాలీ ఎల్.ఎల్.బి 2 చిత్రాలకు కొనసాగింపుగా ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన జాలీ ఎల్.ఎల్.బి 3 అంటూ మూడో భాగం కూడా వచ్చేసింది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ రాబోతోంది. తొలి రెండు చిత్రాలను తీసిన సుభాష్ కపూర్ దీన్ని కూడా దర్శకత్వం వహించారు. 2011లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించడం జరిగింది. నవంబర్ 14వ తేదీ నుండి అంటే రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రాబోతోంది అంటూ గతంలో వార్తలు రాగా.. ఇప్పుడు దానిని నిజం చేస్తూ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జాలీ ఎల్.ఎల్.బీ 3 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రాజస్థాన్లోని బికనీర్ అనే గ్రామంలో ఒక ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరిభాయ్ చేసిన ఒక ప్రయత్నాన్ని ఊరిలోని రైతులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వ అధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్ రైతులను గోల్మాల్ చేసి వారి భూములను సొంతం చేసుకుంటాడు. నిజం తెలుసుకున్న రైతులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా ఈ ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్షీ) వీరికి ఎలాంటి సహాయం చేశారు? లీగల్ కామెడీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. మరి ఓటీటీ లోనైనా అలరిస్తుందా అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.