E-Paper
Advertisement

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం.. పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం..  పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే
Advertisement

Hyderabad News: హిల్ట్‌ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ప్రస్తావించారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం.

తెలంగాణలో రాజకీయాలు కొన్నిరోజులుగా హిల్ట్ పాలసీ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు ప్రజాశాంతి చీప్ కేఏ పాల్. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకో కీలక విషయాలు ప్రస్తావించారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 9,292 ఎకరాల భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం. పాల్‌తో పాటు మరో రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో ఉన్న భూములకు కంపెనీలు పెట్టడం లేదని, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు వివరించారు. ఆయా భూములు ఎవరికి అమ్మకుండా స్టే ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఇలాంటి విలువైన భూములు దుర్వినియోగం చేస్తే వాటిపై కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తలతో అగ్రిమెంట్లు చేసినా అవి నిలబడవని అన్నారు.

Advertisement

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×