E-Paper
Advertisement

Power Generating Kite: ఆకాశంలో ఎగిరే గాలిపటం నుంచి విద్యుత్ ఉత్పత్తి.. చైనా అద్భుత ఆవిష్కరణ!

Power Generating Kite: ఆకాశంలో ఎగిరే గాలిపటం నుంచి విద్యుత్ ఉత్పత్తి.. చైనా అద్భుత ఆవిష్కరణ!
Advertisement

Power Generating Kite| కొత్త కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలు చేయడంలో భారత్ పొరుగు దేశం చైనా ఎల్లప్పుడూ ముందుంటుంది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి దేశాల లాగా ఖరీదైన ప్రయోగాలు చేస్తుంటే.. చైనా మాత్రం ఎక్కువ తక్కువ బడ్జెట్ ప్రయోగాలపై ఫోకస్ చేస్టుంటుంది. అలాంటిదే తాజాగా మరో ఆవిష్కరణ చేసి సక్సెస్ సాధించింది.

చైనా ఇన్నర్ మంగోలియాలో భారీ విద్యుత్ ఉత్పాదక (కరెంటు తయారు చేసే) గాలిపటాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఆకాశంలో భారీ ఎత్తులో గాలి వీస్తున్న సమయంలో ఈ పరీక్షలు చేయడం పవర్ టెక్నాలజీలో ఒక మైలురాయి లాంటిది. చైనాలో జాతీయ పరిశోధన ప్రాజెక్టు భాగంగా రూపొందిన ఈ వ్యవస్థ భవిష్యత్ క్లీన్ పవర్‌కి కొత్త దిశనిస్తుంది.

గాలిపటం నుంచి కరెంట్ తయారీ ఎలా?

Advertisement

ముందుగా హీలియం బెలూన్ సాయంతో గాలిపటాన్ని 300 మీటర్ల ఎత్తుకు ఎగరవేస్తారు. పూర్తిగా విచ్చుకున్న గాలిపటాం.. భూమికి అనుసంధానించిన ట్రాక్షన్ తాడ్లను లాగుతుంది. ఈ లాగుడు కదలిక భూమిపై ఉన్న జనరేటర్‌ను తిప్పి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆకాశంలో ఎగురుతూ విద్యుత్ కేంద్రంలా పనిచేస్తుంది.

వ్యవస్థ రూపకల్పన, గాలిపటం భాగాలు

ఈ నిచ్చెన ఆకారంలో ఉన్న గాలిపటం వ్యవస్థలో మూడు ప్రధాన భాగాలున్నాయి:

Advertisement

గాలిలో ఎగిరే భాగం
ట్రాక్షన్ తాడ్లు
భూమిపై జనరేటర్, పరికరాలు
ఇంతకుముందు 1,200 చదరపు మీటర్ల చిన్న గాలిపటాలతో కూడా స్థిరమైన విద్యుత్ మార్పిడి సాధ్యమని నిరూపించారు.

ఎత్తైన గాలి పవర్ అంటే ఏమిటి?

ఎత్తైన ప్రదేశాల్లో గాలి వేగం ఎక్కువ, స్థిరంగా ఉంటుంది. అందుకే అంతటి ఎత్తులో వీచే గాలి ద్వారా అంతులేనంత విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. ఎత్తైన ప్రాంతంలో వీచీ గాలిలో శక్తి సాంద్రత (ఎనర్జీ డెన్సిటీ) కూడా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల వ్యవస్థలు ఉపయోగంలో ఉన్నాయి. ఆకాశంలోనే టర్బైన్‌లు ఉండే వ్యవస్థ, భూమి నుంచి తాడుతో బంధించిన గాలిపటం వ్యవస్థ. చైనా అభివృద్ధి చేసింది రెండో రకం. భూమి ఆధారితం.

అద్భుత ప్రయోజనాలు, ఖర్చు ఆదా

సాధారణ విండ్ ఫామ్‌ల కంటే 95 శాతం తక్కువ భూమి
90% తక్కువ ఉక్కు వినియోగం
విద్యుత్ ఉత్పాదన ఖర్చు 30 శాతం తగ్గింపు
ఇది అత్యంత ఆర్థికంగా సమర్థవంతమైన, పర్యావరణ హితమైన పరిష్కారం.

భారీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం

ఒకే 10 మెగావాట్ గాలిపటం వ్యవస్థ చాలా పవర్ ఫుల్. ఇది సంవత్సరానికి 20 మిలియన్ కిలోవాట్-గంటల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. దీంతో దాదాపు 10,000 ఇళ్లకు ఏడాది పొడవునా విద్యుత్ అందించవచ్చు.

వాణిజ్య ఉపయోగం కోసం

గాలిపటం పరీక్షా ఫ్లైట్ పూర్తిగా విజయవంతమైంది. గాలిపటం ఎగిరింది, విద్యుత్ ఉత్పత్తి చేసింది, సురక్షితంగా కిందికి వచ్చింది. ఇది ఇంజనీరింగ్ రంగంలో మైలురాయి. భవిష్యత్తులో వాణిజ్యపరంగా ఉపయోగించే అవకాశాలున్నాయి.

Also Read:  ఏఐ పవర్.. 2030 నాటికి మానవులు మృత్యువుని జయించగలరు.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×