E-Paper
Advertisement

Karimnagar News: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. అదనపు కట్నం వేధింపులకు గర్భిణి బలి..

Karimnagar News: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. అదనపు కట్నం వేధింపులకు గర్భిణి బలి..
Advertisement

Karimnagar News: కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 7 నెలల గర్భిణీ మౌనిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత డిసెంబర్‌లో బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో.. మౌనికకు పెళ్లి జరిగింది. అదనపు కట్నం వేధింపుల వల్లే.. మౌనిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబసభ్యులు. దీంతో మౌనిక కుటుంబ సభ్యులు భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో జరిగింది.

అయితే మౌనిక, ప్రశాంత్‌ల వివాహం గత డిసెంబర్ లో జరిగింది. మౌనిక శ్రీరాములపల్లి గ్రామానికి చెందినది, ప్రశాంత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందినవాడు. వివాహ సమయంలో మౌనిక కుటుంబం కట్నం రూపంలో కొంత మొత్తం, బంగారం, ఇతర సామగ్రి ఇచ్చినప్పటికీ, పెళ్లయిన కొన్ని రోజులకే ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు మరింత అదనపు కట్నం ఇవ్వమని వేధించడం ప్రారంభించారు. ఈ వేధింపులు రోజురోజుకూ తీవ్రమై, మౌనిక తీవ్ర మానసికంగా క్షోభ అనుభవించింది.

Advertisement

దీంతో అత్తగారింట్లో వేధింపులు తట్టుకోలేక 7 నెలల గర్భిణితో ఉన్న మౌనిక తన పుట్టింటికి చేరుకుంది. అప్పటికే ఆమె పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ వారి తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని పరిస్థితిని చూసి చివరకు మౌనికి తన పుట్టింటిలోనే ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన గురించి తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. “మా కూతురు ఏడు నెలల గర్భంతో ఉండగా, ఆమె లోపల ఉన్న శిశువు కూడా ఈ వేధింపుల వల్ల మరణించింది. కట్నం కోసం ఇలాంటి దారుణాలు జరగకూడదు” అంటూ వారు ఆరోపిస్తున్నారు. మౌనిక తల్లి ప్రశాంత్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా డిమాండ్ చేసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, భర్తతో పాటు అత్తింటి సభ్యులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. నేడు బంగారం ధర ఎంతుందంటే?

సమాచారం అందుకున్న ఇల్లందకుంట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయిన ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో కట్నం కోసం వేధించడం చాలా దారుణం.. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్న కట్నం వేధింపులు మాత్రం ఆగడం లేదు.. కట్నం వేధింపులకు ఎంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో.. కట్నం కోసం వేధింపులు చేసేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తే ఇలాంటి ఘటనలు జరగవు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×