E-Paper
Advertisement

AI Stops Human Death: ఏఐ పవర్.. 2030 నాటికి మానవులు మృత్యువుని జయించగలరు.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

AI Stops Human Death: ఏఐ పవర్.. 2030 నాటికి మానవులు మృత్యువుని జయించగలరు.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
Advertisement

Human Stops Death With AI Help| పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందేనని తెలిసినా.. ప్రతి మానవుడు ఎక్కువ కాలం జీవించాలని.. మరణం అనేది ఉండకూడదని ఆశిస్తాడు. చిరకాలం అమరంగా ఉండాలని కలలు కంటాడు. అయితే ఇప్పుడు దీని గురించి శాస్త్రవేత్తలు
ఒక షాకింగ్ ప్రకటన చేశారు. మానవులు మరణాన్ని జయించే అవకాశాలున్నాయని.. వీలైనంతగా ఎక్కువ కాలం జీవించగలరని చెప్పారు. ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది.

2030 నాటికి మానవులు మరణాన్ని జయించవచ్చని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఇది కేవలం కల్పితం కాదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (AI), బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ కారణంగా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ టెక్నాలజీ ఒక జీవి ఆయుష్షును నెమ్మదించడం, రోగాలను అరికట్టడం, క్షణాల్లో పునరుజ్జీవనం చేయడం సాధ్యమవుతుంది.

AI: అత్యుత్తమ వైద్యుడు

Advertisement

కృత్రిమ మేధస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. AI కేవలం చాట్‌బాట్‌లు లేదా ఆటోమేటెడ్ రోబోట్‌లకు పరిమితం కాదు. ఇది మన శరీరంలోని ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. రియల్ టైమ్‌లో శరీర ప్రక్రియలను స్కాన్ చేసి, లక్షణాలు కనిపించకముందే రోగాలను గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత వెంటనే కచ్చితమైన చికిత్స అందిస్తుంది. గుండె ఆగిపోవడం, అవయవాల క్షీణతను అరికట్టి, క్యాన్సర్‌ను కూడా నిరోధిస్తుంది.

నానోబాట్‌లు: సూక్ష్మంగా శరీరాన్ని రిపేర్ చేసే టీమ్

నానోటెక్నాలజీ మరో పవర్‌ఫుల్ సాధనం. సూక్ష్మంగా అంటే చీమల కంటే చిన్న సైజులో ఉండే ఈ యంత్రాలు రక్తనాళాల్లో ప్రయాణించి, రోగగ్రస్త కణాలు, హానికరమైన పాథోజెన్‌లను ఎదుర్కొంటాయి. కణ స్థాయిలో దెబ్బతిన్న DNAని మరమ్మతు చేస్తాయి. వృద్ధాప్య ప్రభావాలను కూడా రివర్స్ చేయగలవు. మన శరీరం ఎప్పుడూ “ఆటో-రిపేర్” మోడ్‌లో ఉంటుంది. అంటే ఏదైనా రోగం చేసినా, గాయం అయినా కొంతమేర అదే రిపేర్ చేసుకుటుంది. ఈ నానోబాట్ రిపేరింగ్ వల్ల మానవులు వయసు పెరిగినా ఆరోగ్యంగానే ఉంటారు. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా బయటికి కనిపిస్తాయి.

డిజిటల్ అమరత్వం: కొత్త ప్రయోగం

Advertisement

కొందరు శాస్త్రవేత్తలు మరింత సీరియస్ ప్రయోగం చేస్తున్నారు. మానవ జ్ఞాపకాలు, వ్యక్తిత్వాలను డిజిటల్‌గా సేవ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఒక మనిషి చనిపోయినా అతని మెదడులోని ఆలోచనలు, జ్ఞాపకాలను కంప్యూటర్ రూపంలో సేవ్ చేయగలరు. ఎలాగంటే మానవ స్పృహను కృత్రిమ లేదా రోబోటిక్ ప్రక్రియకు బదిలీ చేయడం లాంటిది. ఇలా చేస్తే ఆ వ్యక్తి శరీరం మరణించినా.. అతను ఆలోచనలు, శాశ్వతత్వంగా ఎక్కువ కాలం సజీవంగా ఉంటాయి.

ఈ భవిష్యత్తు ఎంత వాస్తవికం?

శాస్త్రీయ సమాజం 2030 టైమ్‌లైన్‌పై విభజించబడింది. చాలా మంది నిపుణులు పూర్తి అమరత్వం కోసం 2030 కల్లా ప్రయోగాలు ఫలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమరత్వం సాధ్యం కాకపోయినా.. గణనీయంగా ఎక్కువ ఆయుష్షు గురించి ఏకాభిప్రాయం ఉంది. టెక్నాలజీ, ముఖ్యంగా AI బయోటెక్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రానున్న దశాబ్దంలో మానవ జీవితాన్ని ఈ టెక్నాలజీలు మార్చడం ఖాయం. గణనీయంగా ఎక్కువ కాలం జీవించే ఆశ ఎక్కువగా సాధ్యమవుతోంది.

మానవ అనుభవం మార్పు

ఈ టెక్నాలజీలు మానవ జీవిత అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్‌గా ఉన్నది రోజువారీ జీవితంలో రియాలిటీ అవుతుంది. ఈ ప్రయోగాల లక్ష్యం కేవలం ఎక్కువ కాలం జీవించడం కాదు, ఆరోగ్యంగా, యవ్వన ఉత్సాహంతో వందల సంవత్సరాలు జీవించడం.

Also Read: సోషల్ మీడియాలో ఏఐ వీడియోలతో మోసం.. నకిలీ వీడియోలను ఇలా గుర్తించండి

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×