Vivo Y600 Pro: ప్రముఖ మెుబైల్ కంపెనీ వివో (Vivo).. తన పాపులర్ Y సిరీస్ నుంచి మరో ప్రీమియం మోడల్ ను లాంచ్ చేసింది. వివో Y600 ప్రో (Vivo Y600 Pro) పేరుతో అధునాతన స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. దీనిని ఏకంగా 10,200mAh బిగ్ బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేయడంతో భారత్ లోనూ ఈ ఫోన్ గురించి చర్చ మెుదలైంది. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ ఫోన్ లోని ప్రధాన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం.
తన Y సిరీస్ నుంచి వివో లాంచ్ చేసిన Y400 ప్రో స్మార్ట్ ఫోన్ గతేడాది జూన్ లో భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో బ్యాటరీ 5,500mAh కాగా, ఇటీవల తీసుకొచ్చిన Y500 ప్రోలో 7,000mAh బ్యాటరీని అమర్చారు. ఇప్పుడు చైనాలో లాంచ్ చేసిన Y600 ప్రో మెుబైల్ లో ఏకంగా 10,200 బిగ్ బ్యాటరీని ఫిక్స్ చేయడం.. Y సిరీస్ మెుబైల్స్ విషయంలో వివో వేసిన కీలక ముందడుగుగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 2 నుంచి 4 రోజుల పాటు ఎలాంటి ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చని కంపెనీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.
వివో Y600 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. అలాగే ముందుగా చెప్పుకున్నట్లు 10,200mAh బ్యాటరీతో పాటు దానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్టును అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6 (OriginOS 6)తో ఇది వర్క్ చేయనుంది.
Also Read: జొమాటో సంచలనం.. డెలివరీ బాయ్స్‌కు కూలింగ్ వెస్ట్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
Y600 ప్రో మెుబైల్ ను చైనాలో రెండు స్టోరేజ్ వేరియంట్ల (8GB + 128GB, 12GB + 512GB) లో వివో లాంచ్ చేసింది. అందులో బేసిక్ వేరియంట్ ప్రారంభ ధరను 1,999 యువాన్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.28,000. మరోవైపు ప్రీమియం మోడల్ ను 2,899 యువాన్లకు మార్కెట్ లో విక్రయిస్తుంది. అంటే సుమారు రూ.40,200 అన్నమాట. అయితే 10,200mAh భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ ఇంత తక్కువలో (రూ.30 వేల లోపు) రావడం ఈ ఫోన్ లోనే చూస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: AC Side Effects: ఏసీ అతిగా వాడుతున్నారా? ఈ జబ్బులకు రెడీగా ఉండండి.. ఏ క్షణమైనా..!