E-Paper
Advertisement

Air Conditioner Tips: అమ్మబాబోయ్.. ఏసీ గదిలో బకెట్ వాటర్ పెడితే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Air Conditioner Tips: అమ్మబాబోయ్.. ఏసీ గదిలో బకెట్ వాటర్ పెడితే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
Advertisement

Air Conditioner Tips: వేసవిలో ఏసీల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. భానుడి భగ భగల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ గదుల్లోనే తమ సమయాన్ని ఎక్కువగా గడుపుతుంటారు. అయితే సాధారణంగా ఎయిర్ కండిషనర్లు గదిలోని వేడిని తగ్గించడమే కాకుండా.. గాలిలో ఉన్న తేమను (Humidity) కూడా పీల్చుకుంటాయి. దీనివల్ల గదిలోని గాలి పొడిగా మారి.. కొన్ని సమస్యలకు కారణం కావొచ్చు. కాబట్టి ఈ సమస్యకు బకెట్ వాటర్ చిట్కాతో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

తేమను కాపాడటం

ఏసీ గదుల్లోని గాలి పొడిగా మారడం వల్ల చాలా మందికి చర్మం పొడిబారడం, కళ్లు మంట పుట్టడం లేదా గొంతు ఎండిపోయినట్లు అనిపించడం జరుగుతుంది. కాబట్టి గదిలో ఒక బకెట్ లో నీటిని ఉంచినట్లైతే ఆ నీరు నెమ్మదిగా ఆవిరై (Evaporation) గాలిలో తగినంత తేమను ఉంచుతుంది. ఇది సహజమైన హ్యూమిడిఫైయర్ (Humidifier) లా పనిచేస్తుంది.

శ్వాసకోశ సమస్యలకు చెక్

Advertisement

పొడి గాలి వల్ల ముక్కు లోపలి పొరలు ఎండిపోయి, కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు. తుమ్ములు రావడం వంటివి జరగొచ్చు. గదిలో నీటిని ఉంచడం వల్ల.. గాలి నాణ్యత మెరుగుపడి నిద్రలో శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది.

విద్యుత్ ఆదా అయ్యే ఛాన్స్

గాలిలో తగినంత తేమ ఉన్నప్పుడు గది త్వరగా చల్లబడిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల మనం ఏసీ టెంపరేచర్‌ను మరీ తక్కువలో పెట్టాల్సిన అవసరం ఉండదు. 24°C లేదా 26°C వద్ద కూడా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. తద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.

మొక్కలు, ఫర్నిచర్ రక్షణ

Advertisement

ఏసీ గదిలో ఇండోర్ ప్లాంట్ల్ పెంచుతున్నట్లైతే బకెట్ వాటర్ చిట్కా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా పొడిగాలి వల్ల మెుక్కలు త్వరగా ఎండిపోతాయి. అలాగే చెక్క ఫర్నిచర్ కూడా పగుళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బకెట్ హ్యాక్ ద్వారా ఈ రెండు సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు.

Also Read: WiFi Tips: రూటర్ బాగున్నప్పటికీ.. ఇంటర్నెట్ రావట్లేదా? అయితే ఈ తప్పులు చేస్తున్నట్లే!

ఇలా చేస్తే ఇంకా బెటర్..

ఏసీ గదిలో బకెట్ కంటే వెడల్పాటి మూతి ఉన్న పాత్ర ఇంకా బెటర్ ఉండే ఛాన్స్ ఉంది. నీరు త్వరగా ఆవిరై గది తేమగా ఉండేందుకు మరింత వీలుగా ఉంటుంది. అయితే గదిలో పెట్టిన వాటర్ ను ప్రతీరోజూ తప్పనిసరిగా మార్చాలి. లేదంటే ఆ నీటిలో బ్యాక్టీరియా, దోమలు చేరి అనారోగ్యానికి కారణం కావొచ్చు. మరోవైపు ఏసీ గదిలో పెట్టే నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్స్ వేస్తే గది మంచి సువాసనలతో పరిమళిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Drum Air Cooler: వార్నీ భలే ఉందే.. డ్రమ్ముతో కూలర్ తయారీ.. ఇక మీ డబ్బంతా ఆదా!

Related News

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

Big Stories

Advertisement
×