Aero O2 Fan: ఈ రోజుల్లో కాలుష్యం ఇళ్లకు సైతం పాకిపోతోంది. దీంతో చల్లని గాలితో పాటు స్వచ్ఛమైన గాలిని ఇచ్చే స్మార్ట్ గ్యాడ్జెట్ల వైపు ప్రజలు మెుగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి వచ్చిన ఒరియంట్ కంపెనీ సరికొత్త ప్రొడక్ట్ ‘ఏరో O2 ఫ్యాన్’ (Aero O2 Fan). సాంప్రదాయ ఫ్యాన్లకు, ఆధునిక ఎయిర్ ప్యూరిఫైయర్లకు ఉన్న తేడాను చెరిపేస్తూ వచ్చిన ఈ డివైజ్ పనితీరు యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సీలింగ్ ఫ్యాన్ ప్రధాన ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
ఏరో O2 ఫ్యాన్ పాతకాలపు ఫ్యాన్లలా కాకుండా ఇది చాలా మోడ్రన్, స్లీక్ డిజైన్‌తో రూపొందింది. దీనికి బ్లేడ్లు చూడటానికి అందంగా ఉంటూ ఇంటికి లగ్జరీ లుక్ ను తీసుకురానుంది. దీని డిస్‌ప్లే ప్యానెల్ కూడా చాలా నీట్‌గా, ప్రీమియంగా డిజైన్ ను కలిగి ఉంది.
ఈ ఫ్యాన్ ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ‘ఎయిర్ ప్యూరిఫికేషన్’ సిస్టమ్. ఇందులో అధునాతన HEPA ఫిల్టర్లను ఉపయోగించారు. ఇవి గదిలో ఉండే 99.9% సూక్ష్మ ధూళి కణాలు (PM 2.5), అలర్జీ కారకాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, చెడు వాసనలను సమర్థవంతంగా తొలగిస్తుంది. మీరు ఫ్యాన్ ఆన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే గదిలోని గాలిలో వచ్చే మార్పును స్పష్టంగా గమనించవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఇది ఒక వరమని పేర్కొంటున్నాయి.
ఏరో O2 ఫ్యాన్.. స్వచ్చమైన గాలిని ఇవ్వడంతో పాటు స్మార్ట్ ఫీచర్లను సైతం కలిగి ఉంది. దీనిని స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. లేదంటే వాయిస్ అసిస్టెంట్స్ (Alexa, Google Assistant) ద్వారా కూడా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. గదిలోని గాలి నాణ్యత (AQI) ఎలా ఉందో దీని డిస్‌ప్లేపై రియల్ టైమ్‌లో చూడొచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. రిమోట్ వెతుక్కోవాల్సిన పని లేకుండా ఫోన్ నుంచే టైమర్, మోడ్స్ మార్చుకునే సదుపాయం సైతం కల్పించినట్లు వెల్లడించాయి.
ఇతర ఫ్యాన్లతో పోలిస్తే ఏరో O2 ఫ్యాన్ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి ‘నైట్ మోడ్’ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం శబ్దమే తెలియదని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. డిస్‌ప్లే లైట్లు కూడా డిమ్ అయిపోతాయని పేర్కొంటున్నాయి. దీనివల్ల రాత్రి పూట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన నిద్ర దొరుకుతుందని పేర్కొంటున్నాయి.
Also Read: ఈఎంఐలో ఫ్రిడ్జ్ కొంటున్నారా? ఈ స్మార్ట్ చిట్కాలు పాటిస్తే.. బోలెడంత డబ్బు ఆదా!
అధునాతన స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫ్యాన్.. చాలా పొదుపుగా పవర్ ను వినియోగించనుంది. ఇది ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేయడం వల్ల చాలా తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మెుత్తంగా ఇంటి గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడం కోసం ఒక మంచి స్మార్ట్ పరికరం కోసం చూస్తుంటే.. ‘ఏరో O2 ఫ్యాన్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!