Travel Gadgets: ఆఫీసు పని మీద బయటకు వెళ్లినా లేదంటే ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసినా మన వెంట తీసుకెళ్లే వస్తువులు బ్యాగ్‌లో పట్టక చాలాసార్లు ఇబ్బంది పడుతుంటాం. ల్యాప్‌టాప్, ఛార్జర్, పవర్ బ్యాంక్, ఇతర వస్తువులతో బ్యాక్‌ప్యాక్ నిండిపోతుంటుంది. అయితే కొన్ని అల్ట్రాథిన్ గాడ్జెట్స్ ఉంటే ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. సైజులో చిన్నగా, బరువులో తక్కువగా ఉండే ఈ డివైజ్‌లు ప్రయాణాల్లో చాలా ఉపయోగపడతాయి. అలాంటి ఐదు గాడ్జెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ప్రయాణంలో ఫోన్ బ్యాటరీ అయిపోతే చాలా ఇబ్బంది. ఇన్యూ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ 10,000mAh కెపాసిటీతో వస్తుంది. కేవలం 0.7 అంగుళాల మందంతో పల్చగా ఉండటం దీని ప్రత్యేకత. ఇందులోని USB-C ల్యాన్యాడ్ చార్జింగ్ కేబుల్‌గా మాత్రమే కాకుండా క్యారీ హ్యాండిల్‌లా కూడా ఉపయోగపడుతుంది. బ్యాగ్‌లో పెద్దగా స్థలం తీసుకోదు.
పెద్ద ఫైల్స్, ఫొటోలు, వీడియోలు వెంట తీసుకెళ్లాలంటే ఎక్స్‌టర్నల్ డ్రైవ్ ఉపయోగపడుతుంది. మాక్సోన్ 500GB అల్ట్రా స్లిమ్ డ్రైవ్ కేవలం 0.4 అంగుళాల మందంతో వస్తుంది. అల్యూమినియం బాడీ కారణంగా ప్రీమియం లుక్ ఉంటుంది. ప్లగ్ అండ్ ప్లే సపోర్ట్ ఉండటంతో ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయడం కూడా సులభమే.
Also Read: రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!
పర్సు, బ్యాగ్ లేదా పాస్‌పోర్ట్ ఎక్కడ పెట్టామో గుర్తులేకపోతే టైల్ స్లిమ్ ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు సైజులో ఉండే ఈ బ్లూటూత్ ట్రాకర్ చాలా పల్చగా ఉంటుంది. యాప్ ద్వారా వస్తువు ఉన్న ప్రాంతాన్ని గుర్తించవచ్చు. అలాగే ట్రాకర్‌లోని బటన్ ద్వారా ఫోన్‌ను రింగ్ చేయించుకునే సదుపాయం కూడా ఉంటుంది.
సాధారణ ఛార్జర్లు బ్యాగ్‌లో ఎక్కువ స్థలం తీసుకుంటాయి. ట్రెబ్లెట్ 65W USB-C చార్జర్ మాత్రం కేవలం 0.55 అంగుళాల మందంతో ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటికీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు 65W పవర్ అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఫోన్లకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి ఇది మంచి ఆప్షన్.
ఫోన్ లేదా ట్యాబ్లెట్‌తోనే పని చేసేవారికి ఫోల్డబుల్ కీబోర్డ్ చాలా ఉపయోగకరం. సమ్‌సెర్స్ కీబోర్డ్‌ను మడతపెడితే బ్యాగ్ సైడ్ పాకెట్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఫోల్డ్ చేసినప్పుడు దీని మందం 0.71 అంగుళాలు. బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, iOS, విండోస్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో తక్కువ సామానుతో ఎక్కువ పని చేసుకోవాలనుకునేవారికి ఇవి మంచి గాడ్జెట్స్.
Also Read: ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!