E-Paper
Advertisement

Jio vs Airtel vs Vodafone: జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. వార్షిక రిఛార్జ్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్?

Jio vs Airtel vs Vodafone: జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. వార్షిక రిఛార్జ్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్?
Advertisement

Jio vs Airtel vs Vodafone Annual Prepaid plans Comparison| 2026 సంవత్సరం వచ్చేస్తోంది. చాలా మంది నెలనెలా మొబైల్ రీచార్జ్ చేయడం మానేసి వార్షిక ప్లాన్స్ ఎంచుకుంటున్నారు. ఇండియాలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (విఐ) కంపెనీలు 365 రోజుల వాలిడిటీ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్, ఏఐ టూల్స్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ ప్లాన్ బెస్ట్ తెలుసుకోవడానికి ఈ పోలిక సహాయపడుతుంది.

రిలయన్స్ జియో వార్షిక ప్లాన్స్.. ఏఐ ఫోకస్, స్ట్రాంగ్ ఎకోసిస్టమ్

మూడు టెలికాం కంపెనీల్లో జియో తక్కువ వార్షిక ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. కానీ ప్రీమియం డిజిటల్ బెనిఫిట్స్ జత చేసింది. గూగుల్ జెమినీ ప్రో, జియోఏఐక్లౌడ్ సర్వీసెస్ బండిల్ ఇందులో ఉండడం ప్రత్యేకం.

జియో వాయిస్, డేటా ప్లాన్స్ ఏమిటి?

Advertisement

రూ.3,599 ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ యాక్సెస్, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి.
రూ.3,999 ప్లాన్‌లో ఫ్యాన్‌కోడ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ యాక్సెస్ ఉంది.
రెండు ప్లాన్స్‌లో కూడా 18 నెలల గూగుల్ జెమినీ ప్రో (రూ.35,000 విలువ), 50జీబీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్స్.. మాక్సిమం వెరైటీ, ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి

వొడాఫోన్ అత్యధిక వార్షిక ప్రీపేడ్ ప్లాన్స్ (ఎనిమిది ఆప్షన్స్) ఆఫర్ చేస్తోంది. మీ నగరం టెలికాం సర్కిల్స్‌ ఆధారంగా వేర్వేరుగా ఉన్నాయి.

వొడాఫోన్ వాయిస్-ఓన్లీ ప్లాన్స్

Advertisement

రూ.1,770, రూ.1,849 ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత 3,600 ఎస్‌ఎంఎస్ ఉన్నాయి.

వొడాఫోన్ అన్‌లిమిటెడ్ డేటా, ఓటీటీ ప్లాన్స్

రూ.3,499 ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ ఉన్నాయి.
రూ.3,699లో జియోహాట్‌స్టార్ మొబైల్ ఉండగా.. రూ.3,799 ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్,
రూ.3,999లో జియోహాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ లైట్ రెండూ ఉన్నాయి.
రూ.4,999లో వొడాఫోన్ మూవీస్ అండ్ టీవీ సూపర్ యాక్సెస్ ఉన్నాయి.

వొడాఫోన్ ఇచ్చే స్పెషల్ బెనిఫిట్స్ ఇవే..

వొడాఫోన్లో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఫ్రీ డేటా ఉంది. వీకెండ్‌లో మిగిలిన డేటా ఆటోమాటిక్ రోల్‌ఓవర్ అవుతుంది. నైట్ టైమ్ హెవీ యూజర్లకు ఇది బెస్ట్. ఈ ఆప్షన్ జియోలో లేదు.

ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్స్ – ఏఐ బెనిఫిట్స్, గ్లోబల్ యాక్సెస్ ఉన్నాయి

ఎయిర్‌టెల్ వివిధ యూజర్ల కోసం ఐదు వార్షిక ప్రీపేడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రధాన ఆకర్షణ ఫ్రీ పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్. ఇది సాధారణంగా సంవత్సరానికి రూ.17,000 విలువైనది.

ఎయిర్‌టెల్ వాయిస్-ఓన్లీ, వాయిస్-సెంట్రిక్ ప్లాన్స్

రూ.1,849 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 3,600 ఎస్‌ఎంఎస్, 24జీబీ డేటా ఉన్నాయి. రోజుకు సగటు ఖర్చు రూ.5 దాకా వస్తుంది.
రూ.2,249 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 30జీబీ డేటా, 3,600 ఎస్‌ఎంఎస్ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జీ, ఉచిత ఓటీటీ ప్లాన్స్

రూ.3,599 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ ఉన్నాయి.
రూ.3,999 ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం ఉంది.
రోజుకు డేటా 2.5జీబీ లభిస్తుంది.

Also Read: ఫోన్ కోసం స్పెషల్ బెడ్ తయారు చేసిన ఐకియా.. దీన్ని కొనడం అంత ఈజీ కాదండోయ్!

ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏమిటి?

రూ.4,000 ప్లాన్ విదేశాలకు వెళ్లే వాళ్లకు ఉపయోగకరం. ఇండియాలో రోజుకు 1.5జీబీ డేటా, 180 దేశాల్లో 5జీబీ ఇంటర్నేషనల్ డేటా, 100 ఇంటర్నేషనల్ కాలింగ్ మినిట్స్ ఉన్నాయి.

ఏ వార్షిక ప్లాన్ ఎంచుకోవాలి?

ఏఐ టూల్స్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావాలంటే ఎయిర్‌టెల్ ఎంచుకోండి. గూగుల్ ఏఐ, స్ట్రాంగ్ డిజిటల్ సర్వీసెస్ ఇష్టమైతే జియో తీసుకోండి. మరిన్ని ఆప్షన్స్, ఫ్లెక్సిబుల్ బెనిఫిట్స్ కావాలంటే వొడాఫోన్ బెస్ట్. ప్రతి కంపెనీ వేర్వేరు యూజర్ అవసరాలకు సరిపడేలా టార్గెట్ చేస్తోంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×