UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో తప్పిపోయిన 60 ఏళ్ల జంట కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో డబుల్ మర్డర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిసి షాకయ్యారు పోలీసులు. ఆ జంటను చంపి.. మృతదేహాలను ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత నదిలోకి విసిరేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలో దారుణం.. కలకలం రేపిన డబుల్ మర్డర్
జన్మనిచ్చిన తల్లిదండ్రులను దేవుడితో కొలుస్తారు చాలామంది. వారు లేకుంటే తమకు ఈ జన్మ ఉండదని భావిస్తారు. కానీ తల్లిదండ్రులను చంపితే వారిని రాక్షసులని అంటారు. సరిగ్గా అలాంటి పని చేశాడు యూపీకి చెందిన ఓ వ్యక్తి. ఫ్యామిలీలో డబ్బు మధ్య జరిగిన చిన్నపాటి గొడవ తీవ్రరూపం దాల్చింది.
ఫలితంగా తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు కసాయి కొడుకు. ఆ తర్వాత వారిని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత వాటిని గోమతి నదిలోకి విసిరేశాడు. ఈ విషయాలు తెలిసి పోలీసులు కంగుతిన్నారు. చివరకు నిందితుడ్ని అరెస్టు చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పేరెంట్స్ ని చంపి శరీరాలను ముక్కులుగా చేసి
యూపీలోని జౌన్‌పుర్ జిల్లా అహ్మద్‌పుర్ గ్రామంలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంట్లో ఈ దారుణమైన ఘటన జరిగింది. శ్యాం బహదూర్-బబిత దంపతులు నివాసం ఉంటున్నారు. శ్యామ్ బహదూర్ రీసెంట్‌గా రైల్వేలో రిటైర్ అయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కొడుకు అంబేష్ ఇంజనీరు చదివించారు. ఐదేళ్ల కిందట ముస్లిం యువతిని మతాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు చేసుకున్న ఈ వివాహాన్ని తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. కోడలిని తమ ఇంట్లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. కోడల్ని వదిలేయాలంటే ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేశాడు కొడుకు.
అప్పటి నుంచి తల్లిదండ్రులు-కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీని కారణంగా తలెత్తిన వివాదం గాలివానగా మారింది. డిసెంబర్ 8న రాత్రి ఇంట్లో పేరెంట్స్‌తో మళ్లీ గొడవపడ్డాడు అంబేష్. తొలుత తన తల్లి బబితను రోకలితో కొట్టి చంపాడు. అడ్డొచ్చిన తండ్రి శ్యాం బహదూర్‌ని అదే విధంగా కొట్టాడు. బతికే ఉన్నాడని భావించి గొంతుకు తాడు బిగించి హతమార్చాడు.
ALSO READ: రైల్వే బోగి కింద మంటలు.. తప్పిన పెనుప్రమాదం
మృతదేహాలను ముక్కలుగా కోశాడు. ఆరు ప్లాస్టిక్ సంచుల్లో పెట్టుకుని కారులో తీసుకువెళ్లి గోమతి నదిలో పడేశాడు. ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకుండా చేశాడు. తల్లిదండ్రుల గురించి సోదరీమణులు అడిగినప్పుడు బయటకు వెళ్లారంటూ అబద్ధం చెప్పి తప్పించుకునేవాడు. చివరకు తన ఫోను స్విచ్చాఫ్ చేసుకున్నాడు.
ఇంటికి వెళ్లకుండా తిరుగుతూ వచ్చాడు. అంబేష్ చెల్లెలు డిసెంబరు 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. తొలుత అంబేష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. డిసెంబర్ 16న పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశాడు. అతడ్ని విచారించగా పైవిషయాలు బయటపెట్టాడు. కేవలం డబ్బు కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపేశాడు కసాయి కొడుకు.