BigTV English

Amazon Great Freedom Festival sale 2024: అమెజాన్ కొత్త సేల్.. రూ.99లకే వీటిని కొనేయొచ్చు..!

Amazon Great Freedom Festival sale 2024: అమెజాన్ కొత్త సేల్.. రూ.99లకే వీటిని కొనేయొచ్చు..!

Amazon Great Freedom Festival sale 2024: ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌లలో షాపింగ్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. అందులో ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఫ్లాట్ ఫార్మ్‌లలో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, ఎలక్ట్రానిక్స్, హోమ్‌కి సంబంధించిన ప్రొడక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. అదే క్రమంలో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు తమ వినియోగదారులను మరింత అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించి అబ్బురపరుస్తున్నాయి. అందులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయి.


ప్రతీ పండుగ సమయంలో ఈ రెండు ప్లాట్ ఫార్మ్‌లు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఆఫర్‌తోనే అమెజాన్ ముందుకొచ్చింది. ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డే ఉన్నందున దానికంటే ముందు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024ను తీసుకొచ్చింది. ఈ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో అనేక ప్రొడక్టులపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే ఈ సేల్‌లో అందించే తగ్గింపులు ఒకరోజు ముందుగానే ప్రైమ్ సభ్యులకు అందుబాటులో ఉండనున్నాయి. అంటే ఆగస్టు 5 నుంచి ప్రైమ్ సభ్యులు తగ్గింపులు పొందుతారు.

రూ.99 ధరతో షాపింగ్:


Also Read: కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. కొత్త సేల్ వచ్చింది.. ఫోన్లు, టీవీలపై 80 శాతం డిస్కౌంట్లు!

Amazon ఈ సేల్‌లో స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు కేవలం రూ.99 ధరతో అనేక ఉత్పత్తులను పొందవచ్చని తెలిపింది. అమెజాన్ సేల్ పేజీ నుండి అందిన సమాచారం ప్రకారం.. కేవలం రూ.99 ధరకే కంప్యూటర్ ఉపకరణాలతో పాటు అనేక ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ హెడ్ ఫోన్స్‌ ధర కేవలం రూ.99 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఆఫర్‌లను అందించడానికి అమెజాన్ SBI కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మీరు SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా 24 నెలల నో-కాస్ట్ EMI, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఏదైనా ప్రొడెక్ట్ ఆర్డర్ చేసుకున్న వినియోగదారుకు అదే రోజున ఫ్రీ డెలివరీ వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

అనేక బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు:

ఈ ఫ్రీడమ్ సేల్‌లో డెల్, నాయిస్, బోట్, సామ్‌సంగ్ వంటి పెద్ద బ్రాండ్‌లను 80 శాతం తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌పై రూ.45 వేలు, టాబ్లెట్‌పై 60 శాతం తగ్గింపు, హెడ్‌ఫోన్‌లపై 75 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫైర్ టీవీలో 50% వరకు, అలెక్సా స్మార్ట్ స్పీకర్లపై 35% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. రిఫ్రిజిరేటర్లపై కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ఎల్‌జీ, హైయర్, సామ్‌సంగ్, గోద్రెజ్ బ్రాండ్‌ల గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. మీరు ప్రీమియం రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేస్తే దానిపై నేరుగా రూ.17,000 ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది.

Related News

BSNL Free Internet: 30 రోజులు ఇంటర్నెట్ ఫ్రీ.. బిఎస్ఎన్ఎల్ షాకింగ్ ఆఫర్

Samsung F06 5G vs Tecno Spark Go vs iQOO Z10 Lite: రూ.10000 లోపు బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ ఏది?

Galaxy S24 Discount: రూ.49,999కే గెలాక్సీ S24.. భారీ డిస్కౌంట్.. త్వర పడండి!

Whatsapp AI Writing: వాట్సాప్ లో కొత్త ఫీచర్ లాంచ్.. స్మార్ట్ చాటింగ్ కోసం AI రైటింగ్ అసిస్టెంట్

Plants: మొక్కలకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? అవి ఎలా ప్రతిస్పందిస్తాయంటే?

Redmi 15 5G vs Honor X7c 5G: ₹14,999 ధరకు ఏది బెస్ట్?

Big Stories

×