Viral News: నార్మల్‌గా జంతువులను చూస్తే అల్లంత దూరం పరుగెడతాము. మన మీదకు వచ్చి దాడి చేయడం లేకుంటే చంపేస్తుందని భయపడతాము. అంతే భయం జంతువులకు ఉంటుంది. ఎంత కొట్టినా చావడం లేదని నోటితో కొరికి పాముని చంపేశాడు ఓ వ్యక్తి. ఈ వింత ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగుచూసింది.
ఇదేం వింత ఘటన
తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో పాములు, కొండచిలువలు, రకరకాల జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్ గురించి చెప్పనక్కర్లేదు. వాటి చుట్టూ చెట్లు ఉండడంతో నిత్యం పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం మానోపాడు రైల్వేస్టేషన్ గురించి అందరికీ తెలుసు. రైల్వేకి సంబంధించిన విద్యుత్ సబ్ స్టేషన్ గురించి చెప్పనక్కర్లేదు.
శుభ్రంగా ఉంచుతారు అక్కడి సిబ్బంది. విద్యుత్ సబ్‌స్టేషన్ రూమ్‌లోని పాము చొరబడిందని రైల్వే ఉద్యోగులు స్థానికంగా పాములు పట్టే రాముడుకి కబురు పెట్టారు. రైల్వే ఉద్యోగులు సమాచారం ఇవ్వగానే వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. ఆ రూమ్ లోపలికి వెళ్లి చూశాడు. తక్కువ సమయంలో చాకచక్కగా నాగరాజుని పట్టేశాడు. అది ఎంతకొట్టినా చనిపోలేదు.
పాముని కొరికి చంపేశాడు
చివరకు విసుగు చెందిన స్నేక్ క్యాచర్ రాముడు పాముని నోటితో కొరికి చంపేసి పక్కన పడేశాడు. ఈ సన్నివేశాన్ని చూసినవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇదేం వింత ఘటన స్నేక్ క్యాచర్‌ని అడిగారు. పాముని కొరకడం వల్ల తనకేమీ కాదన్నాడు. ఆ పాముల్లో విషం ఉండదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి రాముడికి ఎలాంటి హానీ లేకుండా క్షేమంగా ఉండడం గమనార్హం.
ALSO READ: ఓరి వీడి దుంప తెగ.. ముక్కుతో బీరు తాడేశాడు
ఈ వ్యవహారం రైల్వే ఉద్యోగులకు తెలిసి షాకయ్యారు. ఆ సమయంలో రాముడు పాము పట్టే సన్నివేశాన్ని ఓ వ్యక్తి తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేశాడు. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి. దీనిపై జంతు ప్రేమికులు భగ్గుమన్నారు.
పామును చంపే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్నేక్ క్యాచర్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాముడుకి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది? అంటూ పలువురు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వింత ఘటన నెట్టింట్లో చిన్నపాటి చర్చ మొదలైంది.