Nose Drinks Beer: ముక్కును ఇలా కూడా వాడతారా? అని నెటిజన్లు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడో ఓ వ్యక్తి. ముక్కుతో గటగటా బీరు తాగుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఫిలిప్పీన్స్ కు చెందిన రస్సెల్ సాల్వడార్ ఆగస్టు 25, 2025న ప్రదర్శించిన ఈ అసాధారణ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రస్సెల్ కేవలం 20 సెకన్లలో తన ముక్కు ద్వారా ఒక పింట్ బీరును దించకుండా తాగాడు.
ఈ ప్రయత్నం రస్సెల్ కేవలం సరదా కోసమే చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని అతడి స్నేహితుడు తెలిపారు. గతంలో చాలాసార్లు రస్సెల్ ముక్కుతో బీర్ తాగే ఫీట్‌ను చేశాడు. ముక్కుతో గాలి పీల్చుకున్నంత సులభంగా గ్లాసు బీరును అవలీలగా తాగేశాడు. గ్లాసు ఖాళీ అయ్యే వరకు ముక్కును అందులోంచి బయటకు తీయకపోవడం ఆశ్చర్యం.
ముక్కుతో బీర్ తాగడం ఏంట్రా… పోయే కాలం కాకపోతే 🤦♀️#Beer pic.twitter.com/M64bX7Ywf8
— Megha (@MovieloverMegha) October 9, 2025
ఇటీవల ఇలాంటి వీడియో యూట్యూబ్ లో వైరల్ అయింది. ఈ వీడియోలో వ్యక్తి బీర్ చాలా సింపుల్ గా, స్పీడ్ ముక్కుతో తాగేస్తున్నాడు.
Also Read: Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్