Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా చేసిన ట్వీట్ వివాదానికి తెరలేపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఇవాళ ఉదయం సంచలన పోస్ట్ పెట్టాడు. పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు.. కానీ తాను పోరాటం ఆపేది లేదన్న రేంజ్ లో ట్విట్ చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోయారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆడతాడని, అందుకే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన గంటలోపే అసలు విషయం తేలిపోయింది. విరాట్ కోహ్లీ పై సొంత అభిమానులే తిరుగుబాటుకు తెర లేపారు.
Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్పకుండానే ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు అని విరాట్ కోహ్లీ పోస్టు పెట్టడంపై సొంత అభిమానులే విరాట్ కోహ్లీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వన్డే వరల్డ్ కప్ 2027, రిటైర్మెంట్ తీసుకోకపోవడం పైన కాదని… కేవలం ఒక యాడ్ కోసం విరాట్ కోహ్లీ ఈ ట్వీట్ చేశాడని తేలింది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. తమ అభిమానంతో విరాట్ కోహ్లీ ఆడుకోవడం ఏమాత్రం సమంజసమేనా ? ఇలాంటి పనులు ఎందుకు చేశావు అని నిలదీస్తున్నారు. ఈ ఒక్క ట్వీట్ తో విరాట్ కోహ్లీ కూడా డబ్బుల మనిషి అని తేలిపోయిందని మరి కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ట్వీట్లు ఇకపై చేయకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది ఇది యాడ్ పోస్ట్ అని ముందే తెలుసు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ సింగిల్ లైన్ ట్వీట్ ఇవాళ రోజంతా హాట్ టాపిక్ అయింది. కాగా wrogn అనే కంపెనీని ప్రమోట్ చేసేందుకు విరాట్ కోహ్లీ ఈ పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.
We've all failed. The trick is to never stop trying. #WrognFailures @imVkohli https://t.co/HXKIXXEeG3
— Wrogn (@StayWrogn) October 16, 2025