BigTV English

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Dinosaur Condom: రాతి శిలాజాల కోసం అన్వేషిస్తున్న ఓ వ్యక్తికి వింత ఆకృతి కనిపించింది. రాతి శిలాజం లోపల ‘డైనోసార్ కండోమ్’ను పోలిన షాకింగ్ వస్తువును గుర్తించారు. అయితే దీనిపై వాస్తవాలను నిపుణులు వెల్లడించారు.


రాతి శిలాజాలపై పరిశోధన చేస్తున్న ఓ వ్యక్తి.. ఓ రాతి లోపల “డైనోసార్ కండోమ్”ను పోలిన రబ్బరు లాంటి వస్తువును కనుగొన్నాడు. ఇది జురాసిక్ కాలం నాటికి చెందిన పురాతన సముద్ర జంతువు బెలెమ్నైట్ శిలాజమని నిపుణులు స్పష్టం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకృతి ఆవిష్కరణల్లో ఇదొక వింత అని పరిశోధకులు అంటున్నారు.

జురాసిక్ కాలం నాటి సముద్ర జంతువు

బెలెమ్నైట్‌లు జురాసిక్ కాలానికి చెందిన స్క్విడ్ లాంటి జీవులు, ఇవి దాదాపు 200 మిలియన్ సంవత్సరాల కిందటివి. రాయి మధ్యలో ఉన్న ఫాజిల్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ అయింది. శిలాజాలపై పరిశోధన చేస్తున్న వ్యక్తికి ఈ వింత కనిపించింది. రాతిని పగులగొట్టిగా అందులో డైనోసార్ కండోమ్ ఆకృతిలో పొడవైన, రబ్బరు లాంటి వస్తువు కనిపిస్తుంది.


డైనోసార్ కండోమ్?

ఆ వస్తువు కండోమ్‌ మాదిరిగా ఉండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ‘శిలాజ కండోమ్’ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని కొందరు “రాతిలో శిలాజ కండోమ్” పిలుస్తున్నారు. మరికొందరు “ఆ కాలంలో కూడా.. ముందు జాగ్రత్త”, “ఇది డైనోసార్ కండోమా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది నిజంగా పురావస్తు పరిశోధనలో బయటపడిందా? లేదా ఏఐ ద్వారా సృష్టించిన వీడియోనా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది బెలెమ్నైట్, కండోమ్ కాదని నిపుణులు చెబుతున్నారు.

కండోమ్ కాదు బెలెమ్మైట్

అమెరికన్ పాలియోంటాలజిస్ట్ డాక్టర్ అల్లిసన్ జాన్సన్ ఈ వైరల్ వీడియోపై స్పందించారు. “ఇది కండోమ్ కాదు, బెలెమ్నైట్ అని పిలిచే పురాతన సముద్ర జంతువు అవశేషం” అని ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు.

Also Read: Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

‘బెలెమ్నైట్స్ జురాసిక్ కాలం నాటి స్క్విడ్ లాంటి జీవులు, ఇవి దాదాపు 200 మిలియన్ సంవత్సరాల కాలం నాటివి. వీటి అంతర్గత అస్థిపంజరాన్ని ‘గార్డ్’ అని పిలుస్తారు. ఇవి పొడవుగా, కుంచించుకుపోయి, తరచుగా రాళ్లలో కనిపిస్తాయి’ అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ శిలాజాలు ఆకారాన్ని బట్టి రబ్బరు వస్తువులుగా భావిస్తుంటారు.

Related News

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×