Shipa Shetty -Raj Kundra: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరైన శిల్పా శెట్టి(Shilpa Shetty), రాజ్ కుంద్రా(Raj Kundra) దంపతులు ఇటీవల కాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల 60 కోట్ల రూపాయల మోసం కేసులో భాగంగా ఈ దంపతులపై లుక్ అవుట్ నోటీసులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వీరిపై ఈ కేసు నమోదు కావడంతో దేశం విడిచి ప్రయాణం చేయకూడదని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే వీరు ఇతర దేశాలకు ప్రయాణం చేయాలి అంటే తప్పనిసరిగా కోర్టు అనుమతితోనే వెళ్లాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబోలో జరగబోయే ఒక యూట్యూబ్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీలంక వెళ్లడానకి ఈ దంపతులు బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ విచారించిన కోర్టు వీరు విదేశాలకు వెళ్లడానికి నిరాకరణ తెలిపింది. అయితే విదేశాలకు తప్పనిసరిగా వెళ్లాలి అంటే ముందుగా 60 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ ఆంక్షలు విధించారు. తాజాగా ఈ ప్రయాణం విషయంలో శిల్ప శెట్టి దంపతులు నిర్ణయం మార్చుకున్నారని అందుకే శ్రీలంక వెళ్లడానికి అనుమతి కోరుతూ వేసిన పిటీషన్ వెనక్కి తీసుకున్నారు.
ఇలా ఈ దంపతులు తమ పిటీషన్ వెనక్కి తీసుకోవడంతో, వీరిపై నమోదు అయిన 60 కోట్ల రూపాయల మోసానికి ఒప్పుకున్నట్టేనని పలువురు భావిస్తున్నారు. అసలు వీరి పై నమోదు అయిన కేసు ఏంటి అనే విషయానికి వస్తే.. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ కొఠారి(Deepak Kothari) వీరిపై గతంలో కేసు నమోదు చేశారు. రాజ్ కుంద్రా దంపతులు తమ నుంచి బిజినెస్ లో భాగంగా సుమారు 60 కోట్ల రూపాయల వరకు డబ్బు తీసుకొని ఆ డబ్బును తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొని తనని మోసం చేశారంటూ ఈ దంపతులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
పిటీషన్ వెనక్కి తీసుకున్న శిల్పా శెట్టి దంపతులు..
ఇలా దీపక్ కొఠారి కేసు ఆధారంగా ఈ దంపతులపై ముంబై కోర్ట్ లుకౌట్ నోటీసులను జారీ చేశారు. అయితే వీరిద్దరూ ఒక యూట్యూబ్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలోనే వీరి ప్రయాణానికి అనుమతి కోరారు. కానీ కోర్టు నుంచి నిరాకరణ ఎదురవుతున్న నేపథ్యంలో చివరికి ఈ దంపతులే ఈ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇలా ఈ జంట తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాజ్ కుంద్రా అస్లీల వీడియోల వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.. పోర్న్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా భారీగా సొమ్ము చేసుకుంటున్నారని అభియోగాలు రావడంతో ఈయనని అరెస్టు చేసి కొన్ని నెలలపాటు జైలులో ఉంచిన సంగతి తెలిసినదే.
Also Read: Chiranjeevi: మెగాస్టార్ తో క్రికెటర్ తిలక్ వర్మ.. చిరు ఘన సత్కారం!