Japan Ice Cream Company: జపనీస్ ఐస్ క్రీం కంపెనీ అకాగి న్యూగ్యో 2016లో పోస్టు చేసిన ఓ వీడియో నెట్టింట మరోసారి వైరల్ అవుతుంది. అకాగి ఐస్ క్రీమ్ ధర 60 యెన్ నుంచి 70 యెన్‌లకు(జపనీస్ కరెన్సీ) పెంచినందుకు ఆ సంస్థ యాజమన్యం ఈ వీడియో పోస్టు చేసింది. 25 సంవత్సరాలలో మొదటి సారిగా ఈ ఐస్ క్రీమ్ ధరను పెంచినట్లు ఆ సంస్థ తెలిపింది. ఐస్ క్రీం తయారీకి ఖర్చు పెరగడంతో ధరలు పెంచినట్లు అకాగి కంపెనీ తెలిపింది.
తమను క్షమించండి అంటూ 2016లో ఓ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. నిజాయితీగా ఉండటం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియో మరొసారి రుజువు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తక్కువ ధరే పెంచినా ఆ సంస్థ నిజాయితీగా క్షమాపణలు చెప్పిందని ప్రశంసిస్తున్నారు.
గరిగారి-కున్ అనేది 1981 నుంచి జపాన్‌లోని పిల్లలు, పెద్దలు ఇష్టపడే రుచికరమైన ఐస్ క్రీమ్ పాప్సికల్. ఇది చౌకగా దొరుకుతుంది. 2016లో ఈ ఐస్ క్రీమ్ ధరను 10 యెన్‌లను(సుమారు రూ.6) పెంచింది కంపెనీ. ధర పెంపుపై అకాగి న్యూగ్యో కంపెనీ ఓ వీడియో విడుదల చేసింది. కార్మికులందరూ ఒక చోట నిలబడి ధర పెంచినందుకు క్షమాపణలు చెబుతూ.. ఎందుకు ధర పెంచాల్సి వచ్చిందో వివరించారు. కంపెనీ ప్రతినిధుల నిజాయితీని ప్రజలు ప్రశంసించారు.
తాజాగా ఈ వీడియో మరోసారి వైరల్ అవుతుంది. ఆడిటీ సెంట్రల్ వంటి వెబ్‌సైట్‌లలో ప్రజలు కూడా దీనిపై మాట్లాడుకుంటున్నారు. చాలా కంపెనీలు ఎలాంటి సమాచారం లేకుండానే ధరలను పెంచుతాయి, కానీ అకాగి న్యూగ్యో నిజాయితీగా ఉందని చర్చించుకుంటున్నారు. జపాన్ కస్టమర్లను తమ స్నేహితులలాగా భావించి ఈ విధంగా చేశారని అంటున్నారు. దీనిని స్థానిక భాషలో ఓమోటేనాషి అని పిలుస్తారని చెబుతున్నారు. నేడు నిత్యం ధరలు పెరుగుతున్నందున, ఈ ప్రకటన ఒక పెద్ద కనువిప్పుగా అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు.
‘క్షమించండి అని అకాగి న్యూగ్యో చేసిన ప్రకటన చాలా బాగుంది, ఆ కంపెనీ ధర పెంపును దాచలేదు. వారు చాలా వినయంగా దాని గురించి మాట్లాడారు. అందుకే ప్రజలు ఇప్పటికీ ఈ సంస్థ ఐస్ క్రీమ్ లను ఇష్టపడతారు. మీరు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించండి. దయగా, నిజాయితీగా ఉండటం ఎప్పుడూ పాతది కాదని ఈ వీడియో నిరూపించింది’ అని ఓ నెటిజన్ అన్నారు.
Also Read: New Vande Bharat: రోడ్డెక్కిన వందే భారత్ రైలు.. ఏంటీ షాకయ్యారా? మీరే చూడండి